UG and PG Admissions: నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

మణిపూర్‌లోని నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ.. 2024–25 విద్యాసంవత్సరానికి స్పోర్ట్స్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, గేమ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

కోర్సులు– సీట్లు
»    మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌(ఎంపీఈఎస్‌): కోర్సు వ్యవధి రెండేళ్లు, సీట్లు–30. 
»    బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌(బీపీఈఎస్‌): కోర్సు వ్యవధి మూడేళ్లు, సీట్లు–50.
»    మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్‌: కోర్సు వ్యవధి రెండేళ్లు, సీట్లు–20. 
»    బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్‌: కోర్సు వ్యవధి నాలుగేళ్లు, సీట్లు–80.
»    మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఇన్‌ స్పోర్ట్స్‌ సైకాలజీ: కోర్సు వ్యవధి రెండేళ్లు, సీట్లు–15.
»    మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ అప్లయిడ్‌ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌: కోర్సు వ్యవధి రెండేళ్లు, సీట్లు–15.
»    అర్హత: కోర్సును అనుసరించి 12వ తరగతి, డిప్లొమా/పీజీ డిప్లొమా, డిగ్రీ తదితరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 
»    ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్, గేమ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైవా వోస్‌ తదితరాల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.06.2024
»    ప్రవేశ పరీక్ష తేది: 09.07.2024
»    వెబ్‌సైట్‌: www.nsu.ac.in/admission

IIIT Intergrated B Tech Admissions: బాసరలో ట్రిపుల్‌ఐటీ ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు..

#Tags