Navodaya Vidyalaya Admissions : నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తులకు నోటిఫికేషన్
తిరుపతి : నవోదయ విద్యాలయాల్లో 2025–26వ విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వెలువడింది. ఆ మేరకు తిరుపతిలోని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 653, ఇందులో మన రాష్ట్రంలో 15, తెలంగాణలో 9 ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి: Engineering Counselling 2024: Approval for 63,000 Seats for Academic Year 2024–25!
ఈ విద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాలతో సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఉచిత విద్య, అలాగే ఉచిత వసతి, భోజనం సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు. రెగ్యులర్ చదువుతో పాటు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారన్నారు. ఏటా ఒక్కో నవోదయ విద్యాలయంలో 80మందికి ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారని పేర్కొన్నారు. 2025, జనవరి 18వ తేదీన జాతీయ స్థాయిలో నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్టు(జేఎన్‌వీఎస్‌టీ)కు ఈ ఏడాది 5వ తరగతి చదివే విద్యార్థులు అర్హులని, దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబరు 16వ తేదీ ఆఖరు అని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలకు 86888 88802, 93999 76999నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
Tags
- Navodaya Vidyalayas
- Navodaya Admissions
- sakhieducation latest updates
- Education News
- Navodaya Vidyalaya Admissions
- Navodaya Vidyalayas entrance exam
- Class 6 admission 2025-26
- Entrance exam applications
- Vishwam Competitive Examination Center Tirupati
- Coaching Federation of India Vice President
- Dr. N. Viswanatha Reddy statement
- Academic year 2025-26 admissions
- Navodaya Vidyalayas notification
- Entrance exam for class 6
- Competitive examination information