AP Open School Inter Admissions : ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్మీడియట్‌లో నూత‌న విద్యాసంవ‌త్స‌ర ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఓపెన్‌ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. వివిధ కారణాల వలన చదువు కొనసాగించలేని గ్రామీణ యువతీ యువకులు, స్త్రీ, పురుషులు, ప్రత్యేక అవసరాలు గల వారు అర్హులు. 

➜    గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, హె చ్‌ఈసీ, సీఈసీ.
➜    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంటర్‌ మధ్యలో మానేసిన అభ్యర్థులు అర్హులు.
➜    వయసు: 31.08.2024 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
➜    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
➜    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 31.07.2024.
➜    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.08.2024.
➜    రూ.200 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు చివరితేది: 28.08.2024, రూ.200 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు చివరితేది:04.09.2024
➜    వెబ్‌సైట్‌: https://apopenschool.ap.gov.in

Backlog posts Examination: SC, ST బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి పరీక్షలు

#Tags