Admission in Sainik Schools: సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్‌ ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇలా..

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) వరంగల్‌ జిల్లా అశోక్‌నగర్‌ బాలుర సైనిక పాఠశాలలో.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు బాలుర నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం సీట్లు: ఆరో తరగతి-80 సీట్లు, ఇంటర్‌-80 సీట్లు.
రిజర్వేషన్‌ వారీగా సీట్లు: ఎస్టీ-58, బీసీ-05, ఎస్సీ-05, మైనారిటీలు-05, ఇతర కులాలకు 05, గురుకుల ఉద్యోగాల కోటాకు 01, స్పోర్ట్స్‌ కోటాకు 1 సీటు కేటాయించారు.
అర్హత: ఆరో తరగతికి 2023-24 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతి పరీక్షకు హాజరైన/ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు. ఇంటర్‌కు 2023-25 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షకు హాజరైన/ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000(పట్టణ ప్రాంతం), రూ.1,50,000(గ్రామీణ ప్రాంతం) మించకూడదు. తెలుగు/ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులు అర్హులు.
వయసు: 31.03.2024 నాటికి ఇంటర్‌కు 01.04.2007 నుంచి 31.03.2009 మధ్య జన్మించిన బాలురు అర్హులు. ఆరో తరగతికి 01.04.2012 నుంచి 31.03.2014 మధ్య జన్మించిన బాలురు అర్హులు.

ఎంపిక విధానం: రాత పరీక్ష,శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: ఆరో తరగతికి ఐదో తరగతి స్థాయిలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు 100 ఉంటాయి. తెలుగు(20 మార్కులు), ఇంగ్లిష్‌(30 మార్కులు), మ్యాథ్స్‌(30 మార్కులు), సైన్స్‌(10 మార్కులు), సోషల్‌ స్టడీస్‌(10 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్‌ రాతపరీక్ష ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి స్థాయిలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు 100 ఉంటాయి. ఇంగ్లిష్‌(20 మార్కులు), మ్యాథ్స్‌(40 మార్కులు), ఫిజిక్స్‌(20 మార్కులు), కెమిస్ట్రీ(15 మార్కులు), బయాలజీ(5 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.03.2024
ప్రవేశ పరీక్షతేది: 07.04.2024.

వెబ్‌సైట్‌: https://www.tgtwgurukulam.telangana.gov.in/

చదవండి: Admissions in AP Model Schools: ఏపీ మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

#Tags