Admissions: ‘ఏకలవ్య’లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

భద్రాచలంఅర్బన్‌: 2024–25 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 8 ఏకలవ్య మోడల్‌ సంక్షేమ విద్యాలయాల్లో 6 తరగతి(ఇంగ్లిష్‌ మీడియం–సీబీఎస్‌ఈ సిలబస్‌)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌ జైన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గండుగులపల్లి, పాల్వంచ, గుండాల, టేకులపల్లి, చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి, సింగరేణి ప్రాంతాల్లో పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈనెల 22వ తేదీ వరకు (https://tsemrs.telangana.gov.in/) వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని, ఇతర వివరాలకు సమీపంలోని ఏకలవ్య పాఠశాలలను సందర్శించాలని వివరించారు.

పరీక్ష కేంద్రంలో డీఐఈఓ తనిఖీ
టేకులపల్లి: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా జరిగాయి. డీఐఈఓ బి.సులోచనారాణి టేకులపల్లి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోని పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఓ బాబు, సీఎస్‌ కల్పనని వివవరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ 138 మంది విద్యార్థులకు గాను 131 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏడుగురు గైర్హాజరయ్యారు. డీఐఈఓ వెంట డీఈసీ సభ్యులు యూసుఫ్‌, సుధాకర్‌రెడ్డి ఉన్నారు. ఎస్‌ఐ షేక్‌ సైదా రహూఫ్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

#Tags