Elon Musk Pay Package: ప్రపంచంలోనే ఎక్కువ వేతనం తీసుకుంటున్న సీఈవో.. జీతం ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

ప్రముఖ ఎలక్ట్రిక్‌కార్ల తయారీసంస్థ టెస్లా సీఈఓ ఇలాన్‌మస్క్‌ ఏడాది వేతనం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అవును..మనలో చాలామంది వేతనం ఏటా రూ.లక్షల్లో ఉంటుంది కదా. కంపెనీ యాజమాన్య స్థాయిలో కీలక పదవుల్లో ఉన్నవారి జీతం రూ.కోట్లల్లో ఉంటుందని తెలుసు కదా. మరి, మస్క​్‌ వేతనం ఎంతో తెలుసా.. ఏకంగా రూ.4.67లక్షల కోట్లు(56 బిలియన్‌ డాలర్లు).

ఇందులో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆయనకు ఇంత వేతనం ఇచ్చేందుకు కంపెనీ వాటాదారులు కూడా అనుమతించారు. దాంతో ప్రపంచంలోనే ఎక్కువ వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో మస్క్‌ నం.1గా కొనసాగుతున్నారు.

IT Companies Likely To Onboard Freshers: ఐటీ కంపెనీలు ఇంతపని చేస్తున్నాయా?.. రోజులు గడుస్తున్నా..

టెక్సాస్‌లో జరిగిన టెస్లా వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో సీఈఓ ఇలాన్‌ మస్క్ వేతనాన్ని నిర్ధారిస్తూ వాటాదారుల ఓటింగ్‌ నిర్వహించారు. ఇందులో ఆయన వార్షిక వేతనం ఏకంగా 56 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు(రూ.4,67,880 కోట్లు)గా నిర్ణయించారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా ఈ ప్యాకేజీలో వాటాదారులు సవరణలు చేయవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వేతనంలో సింహభాగం నగదు రూపంలో కాకుండా ‘ఆల్‌-స్టాక్‌ కంపెన్‌జేషన్‌’(ఏడాదిలో స్టాక్‌ విలువ పెంపు ఆధారంగా షేర్ల కేటాయింపు)గా ఇస్తారని కొన్ని మీడియా కథనాలు నివేదించాయి. తాజాగా నిర్ణయించిన ప్యాకేజీలోని స్టాక్‌లను ఐదేళ్లపాటు విక్రయించనని మస్క్‌ హామీ ఇచ్చారు.

టెస్లా కంపెనీలోని ఏఐ పురోగతిని వేరేచోటుకి తీసుకెళ్లకుండా నిరోధించడానికి కంపెనీలో 25% వాటాను కోరుతున్నట్లు గతంలో మస్క్‌ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన కోరుకున్న వేతన ప్యాకేజీని ఇవ్వడంలో వాటాదారులు విఫలమైతే కంపెనీ తయారుచేస్తున్న ఏఐ, రోబోటిక్స్‌ ఉత్పత్తులను బయట తయారుచేస్తానని జనవరిలోనే చెప్పారు.

TS ICET Results 2024 Here Is The Direct Link To Download Rank: ఐసెట్‌ ఫలితాలు వచ్చేశాయి, మీ ర్యాంక్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

తాను కంపెనీతో కలిసి ఉండాలనుకుంటున్నట్లు మస్క్‌ ఏజీఎంలో తెలిపారు. ఇప్పటికే వేతనానికి సంబంధించి ఇలాన్‌మస్క్‌ డెలావేర్ ఛాన్సరీ కోర్టులో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెప్పాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో బీవైడీ, షావోమీ వంటి చైనా కంపెనీలు రంగప్రవేశం చేయడంతో టెస్లాకార్లకు డిమాండ్‌ మందగించిందని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఇటీవల విడుదల చేసిన క్యూ2 ఫలితాల్లో టెస్లా అమ్మకాలు క్షీణించాయి. లాభాల మార్జిన్‌లు తగ్గినట్లు కంపెనీ నివేదించింది.

#Tags