NMMS Results: ఎన్‌ఎంఎంఎస్‌ ఫ‌లితాలు విడుద‌ల‌.. త్వ‌ర‌లో మెరిట్‌ కార్డుల పంపిణి!

గ‌తేడాది నిర్వ‌హించిన ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష‌కు సంబంధించిన ఫ‌లితాలు విడుద‌ల చేశామ‌ని డీఈఓ దేవ‌రాజు వివ‌రించారు. విద్యార్థులు వారి ఫ‌లితాలు ప‌రిశీలించుకునేందుకు ప్ర‌క‌టించిన వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల‌ని తెలిపారు..

చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్‌ (నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ దేవరాజు వెల్లడించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను https://www.bse.ap.gov.in/NMMS.aspx  వెబ్‌సైట్‌లో చూసుకోవాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు త్వరలో మెరిట్‌ కార్డులు పంపనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులు వెంటనే ఏదైనా జాతీయ బ్యాంకులో విద్యార్థి పేరుతో సేవింగ్స్‌ బ్యాంకు ఖాతా తెరవాలన్నారు.

Gurukul Schools: ఈనెల 15వ తేదీలోపు గురుకుల పాఠశాలల్లో బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి దరఖాస్తులు..

విద్యార్థి ఆధార్‌ నంబర్‌ను మాత్రమే అకౌంట్‌ నంబర్‌కు లింక్‌ చేయాలని చెప్పారు. ఎంపికై న విద్యార్థుల కోసం త్వరలో జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ www. scholarships.gov.in ను తెరుస్తుందని తెలిపారు. ఆ తర్వాత ఎంపికైన ప్రతి విద్యార్థి నమోదు చేసుకునేందుకు విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, మెరిట్‌ లిస్టు మెరిట్‌ కార్డులో ఉన్న విధంగానే ఆధార్‌ కార్డులోనూ, బ్యాంకు పాస్‌ పుస్తకంలోనూ తప్పులు లేకుండా చూసుకోవాలని డీఈఓ తెలిపారు.

Employment Opportunity: నిరుద్యోగ యువ‌త‌కు సుల‌భంగా ఉపాధి అవకాశాలు.. ఒక్క క్లిక్‌తోనే ఇలా!

#Tags