Skip to main content

No Notification : డిగ్రీ ప్ర‌వేశాలకు విడుద‌ల కాని నోటిఫికేష‌న్‌.. ఇది విద్యార్థుల ప‌రిస్థితి..

ఈ ఏడాది ఏప్రిల్‌ 12న ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు వెలువడి దాదాపు 73 రోజులు కావస్తున్నా... నేటికీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలపై స్పష్టత లేకుండా ఉంది.
No notifications for degree admissions in Andhra Pradesh

తాడిపత్రి రూరల్‌: కొత్తగా యూజీ (డిగ్రీ) కోర్సుల్లో చేరబోయే విద్యార్థులకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. విద్యాసంవత్సరం ప్రారంభమైనా.. ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్లపై ఉన్నత విద్యామండలి ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడంతో ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ విద్య వైపు దృష్టి సారించాల్సి వస్తోంది.

Campus Recruitment Drive: ఐటీఐ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఈనెల 28న క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌

ఫలితాలు వెలువడి 73 రోజులు కావస్తున్నా...

ఈ ఏడాది ఏప్రిల్‌ 12న ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు వెలువడి దాదాపు 73 రోజులు కావస్తున్నా... నేటికీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలపై స్పష్టత లేకుండా ఉంది. ఈ నెల 18న ఇంటర్‌ ద్వితీయ సంవత్సర సప్లి ఫలితాలు వెలువడడంతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ ఉన్నత విద్యావకాశాలపై దృష్టి సారించారు. ఏటా ఇంటర్‌ ఫలితాలు వెలువడిన అనంతరం డిగ్రీలో ప్రవేశాలకు విధి విధానాలను ఉన్నత విద్యామండలి రూపొందించి, నోటిఫికేషన్‌ జారీ చేస్తోంది. దీని ప్రకారం ఆయా కళాశాలల యాజమాన్యం అడ్మిషన్ల పక్రియ చేపడుతూ వచ్చాయి. గత ఏడాది సైతం జూన్‌ 20న అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. సకాలంలో అడ్మిషన్లు చేపట్టినప్పుడే అరకొరగా విద్యార్థులు కళాశాలల్లో చేరుతున్నారని, ఇక ఆలస్యంగా అయితే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందనే ఆందోళన కళాశాలల యాజమాన్యాల్లో వ్యక్తమవుతోంది.

AP DSC Posts : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే డీఎస్సీ పోస్టులకు ప్రకటన

ఆన్‌లైన్‌ అడ్మిషన్లతో నూతన ఒరవడి..

గతంలో డిగ్రీలో ప్రవేశాలకు ఆఫ్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లను చేపట్టేవారు. దీంతో పట్టణ ప్రాంతాల్లోని కళాశాలలకు డిమాండ్‌కు ఎక్కువగా ఉండేది. పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉండే కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య అరకొరగా ఉండేది. దీంతో వెనుకబడిన విద్యార్థులు చాలా నష్టపోయేవారు. ఈ సమస్య నుంచే విద్యార్థులకు ఊరట దక్కేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు శ్రీకారం చుట్టింది. దీంతో ఆధునిక వసతులున్న కళాశాలలను ఎంపిక చేసుకునే వెసులుబాటు విద్యార్థులకు కల్పిస్తూ 2021 నుంచి ఆన్‌లైన్‌ అడ్మిషన్లను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపులు చేయడంతో ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో చాలా సులువుగా సీట్లు దక్కాయి. అంతేకాక జగనన్న విద్యా దీవెనను సమర్థంగా అమలు చేయడంతో ఉన్నత విద్య ఓ వెలుగు వెలిగింది.

Teacher Jobs: ఖాళీ పోస్టులతో అవస్థలు.. టీచర్లు లేక విద్యార్థులు ఇలా..

అడ్మిషన్లపై చొరవ చూపని ప్రభుత్వం..

డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లపై నూతన ప్రభుత్వం చొరవ చూపడం లేదనే భావన కళాశాలల యాజమాన్యాల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏపీ మంత్రుల పోర్ట్‌ఫోలియోలో ప్రత్యేకంగా విద్యాశాఖ అని పేర్కొనకపోవడంతో ఈ శాఖ ఎవరికీ కేటాయించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రభుత్వం ప్రత్యేకంగా మానవ వనరుల అభివృద్ధి శాఖగా పేర్కొంటూ ఇందులో పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్య, అక్షరాస్యత పెంపు లాంటి అంశాలను చేరుస్తూ మంత్రిగా నారా లోకేష్‌కు బాధ్యతలను సీఎం చంద్రబాబు కేటాయించారు.

TS Gurukula Jobs Appointment Date 2024 : శుభ‌వార్త‌.. వివిధ గురుకుల‌ల్లో పోస్టుల భ‌ర్తీ జూలైలోనే.. ఇంకా.

ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చలు జరిపి డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేసే దిశగా నారా లోకేష్‌ ఇప్పటి వరకూ చొరవ చూపకపోవడంతో సర్వత్రా గందరగోళం నెలకొంది. గతంలో కరోనా వల్ల గాడి తిప్పన విద్యా వ్యవస్థను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలతో చక్కబెట్టింది. తనకిచ్చిన శాఖల పట్ల నారా లోకేష్‌ పూర్తి స్థాయి అవగాహనకు వచ్చిన తరువాత అధికారులతో చర్చలు జరిపి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తుండడంతో డిగ్రీ అడ్మిషన్లు ఆఫ్‌లైన్‌లో చేపట్టాలా? లేకా ఆన్‌లైన్‌ ద్వారానా? అనే అంశం తేల్చుకోలేక ఉన్నత విద్యామండలి సందిగ్ధంలో పడింది.

ప్రత్యామ్నాయం వైపు విద్యార్థులు..

డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ జారీలో చోటు చేసుకుంటున్న జాప్యం కారణంగా విద్యాసంవత్సరం కోల్పోవడం ఇష్టం లేని విద్యార్థులు ప్రత్యామ్నాయ కోర్సుల వైపు దృష్టి సారిస్తున్నారు. దీనికి తోడు కళాశాలల యాజమాన్యాలు సైతం నోటిషికేషన్‌ ఇప్పట్లో రాదనే భావనతో విద్యార్థులను భయపెడుతున్నాయి. దీంతో పలు ప్రైవేట్‌ విద్యాసంస్థలు పలు రకాల కోర్సులతో విద్యార్థులకు గాలం వేస్తున్నాయి.

AP DSC : 23 వేలకు పైగా టీచర్‌ పోస్టులు భర్తీ చేసింది గత సర్కారే

 

                                                    డిగ్రీ అడ్మిషన్లపై సందిగ్ధం

Published date : 26 Jun 2024 09:48AM

Photo Stories