4, 500 Jobs: పల్లెల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువులు

పల్లెల్లోని విద్యావంతులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు కల్పించడమే స్మార్ట్‌ డీవీ లక్ష్యమని.. తమ కంపెనీలో 4,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపక్‌కుమార్‌ తాళ్ల తెలిపారు.
పల్లెల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువులు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని అగరమంగళంలో ఆయనతో పాటు ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఆర్‌ పురం మండలం కొట్టార్లపల్లి వద్ద స్మార్ట్‌ డీవీ కంపెనీ ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఎంవోయూ జరిగిందని, నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.

చదవండి: AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1458 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల... ఎవరు అర్హులంటే..

దీనిలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు డిసెంబర్‌ 23న పరీక్షలు నిర్వహిస్తామని, తొలి విడతగా 600 మందిని తీసుకుంటామన్నారు. డిప్లొమా, బీటెక్‌ పూర్తి చేసిన వారితో పాటు ప్రస్తుతం చదువుతున్న వారూ అర్హులని తెలిపారు. ఎంపికైన ఫస్టియర్‌ డిపొ్లమో, బీకాం, డిగ్రీ చేసిన వారికి రూ.2.70 లక్షలు, బీటెక్‌ చేసిన వారికి రూ.3.30 లక్షల ప్యాకేజీ ఉంటుందన్నారు.

చదవండి: AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టులో 135 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

#Tags