వీఆర్‌ఏల సర్దుబాటుకు కొత్త పోస్టులు

● ఉమ్మడి జిల్లా పరిధిలో 1887 కేటాయింపు
వీఆర్‌ఏల సర్దుబాటుకు కొత్త పోస్టులు

హన్మకొండ అర్బన్‌: వీఆర్‌ఏల సదర్దుబాటు కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వారికి అవసరమైన పోస్టులు, సూపర్‌ న్యూమరీ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం వివిధ కేటగిరీల్లో 1887 పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో వరంగల్‌ జి ల్లాకు 312, హనుమకొండ 354, జనగామ 304, జయశంకర్‌ భూపాలపల్లి 288, మహబూబాబాద్‌ 287, ములుగుకు 242 ఉన్నాయి. ఆయా పోస్టుల్లో రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ స బార్డినేట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, చైన్‌మెన్‌, ఇరిగేషన్‌ విభాగంలో లష్కర్‌, హెల్పర్‌, మిషన్‌ భగీరథలో హెల్పర్‌, మున్సిపల్‌లో వార్డు ఆఫీసర్‌ పోస్టులు ఉ న్నాయి. కాగా, జిల్లాల్లో ఇప్పటికే వివిధ శాఖల్లో ఖా ళీలను గుర్తించి సిద్ధం చేశారు. మొత్తంగా వీఆర్‌ఏల సదర్దుబాటుకు ఉన్న ఆటంకాలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం తొలగిస్తోంది. ఇక వారసత్వ ఉద్యోగాల కు సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉందని అ ధికారులు చెపుతున్నారు. దీనితోపాటు వీఆర్‌ఏల స ర్టిఫికెట్లు, వివరాల పరిశీలన వేగంగా సాగుతోంది.

#Tags