Job Mela: ఐటీడీఏ ఆధ్వర్యంలో 23న జాబ్‌మేళా
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యాన ఈ నెల 23న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గిరిజన నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళా నిర్వహిస్తు న్నట్లు పీఓ ప్రతీక్‌జైన్ తెలిపారు. నర్సింగ్ ఉద్యోగాలతో పాటు సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొ న్నారు. అలాగే, గిరిజన నిరుద్యోగ యువతకు వివిధ సంస్థల ద్వారా వెబ్ మొబైల్ అప్లికేషన్, బ్యూటీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, సీసీ టీవీ టెక్నీషియన్, టూవీలర్ మెకానిజంలో భోజ న, వసతితో కూడిన ఉచిత శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హత పత్రాలు, ఆధార్‌కార్డు, కులధ్రువీకరణ జిరాక్స్‌లతో ఈనెల 23న ఉదయం 9 గంటలకు భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పీఓ సూచించారు.
#Tags