Job mela: రేపు వికాస ఆధ్వర్యంలో జాబ్‌మేళా

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): ‘వికాస ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నవంబర్ 18 శనివారం ఉదయం జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ లచ్చారావు నవంబర్ 16 గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌బీమోటర్‌ కార్ప్‌లో టెలికాలర్స్‌, సేల్స్‌ ఎక్జిక్యూటివ్‌,ఫైనానన్స్‌ మేనేజర్‌ తదితర ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటిఐ ఉత్తీర్ణులు ఈ పోస్టులకు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 18 శనివారం కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు విద్యార్హతల సర్టిఫికెట్స్‌ జెరాక్స్‌ల తో హాజరుకావాలన్నారు. వివరాలకు 7660823903 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

చ‌ద‌వండి: 3,220 ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ప్రిపరేషన్‌ ఇలా

సంయుక్త బ్యాంకు ఖాతాలు తప్పనిసరి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకం కోసం లబ్ధిదారులందరూ తల్లి పేరుతో కలిపి సంయుక్త బ్యాంక్‌ ఖాతాలు నవంబర్ 24వ తేదీ లోగా మార్చుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం.సందీప్‌ నవంబర్ 16 గురువారం ప్రకటనలో కోరారు. ఇప్పటి వరకూ పథకం ఆర్థిక లబ్ధిని తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారని, ఇకపై విద్యార్థులు తమ తల్లితో పాటు సంయుక్త ఖాతా తెరవాల్సి ఉందన్నారు. కొత్తగా ప్రారంభించే ఖాతాలో విద్యార్థి ప్రాథమిక ఖాతాదారుగా, తల్లి ద్వితీయ ఖాతాదారుగా ఉండాలన్నారు. 2023 – 24 విద్యా సంవత్సరంలో చివరి సంవత్సరం చదువుతున్న అన్ని కేటగిరీల విద్యార్థులకు ఉమ్మడి ఖాతా అవసరం లేదని స్పష్టం చేశారు. నవంబర్ 24వ తేదీలోగా సంయుక్త బ్యాంకు ఖాతాలను తెరవాలని, తెరచిన ఖాతా వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సంక్షేమ, విద్యా సహాయకులకు అందజేయాలన్నారు.

చ‌ద‌వండి: ONGC Scholarships: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు... ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్పు

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడా మైదానంలో పాఠశాల క్రీడా సమాఖ్య అండర్‌–17 బాలురు, బాలికల ఖో–ఖో పోటీలు నవంబర్ 16 గురువారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్సీ కర్రిపద్మశ్రీ ప్రారంభించారు. పాఠశాల క్రీడా సమాఖ్య అండర్‌–17 ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడతూ నవంబర్ 18 వరకు జరిగే ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 340 మంది క్రీడాకారులు, 50 మంది క్రీడాధికారులు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు రవిరాజు, ప్రధానోపాధ్యాయులు రంగారావు తదితరులు పాల్గొన్నారు.

#Tags