Skip to main content

Course Training: నిరుద్యోగ యువ‌తకు స్వ‌యం ఉపాధి కోర్సుల్లో శిక్ష‌ణ‌

నిరుద్యోగ యువ‌తకు స్వ‌యం ఉపాధి కోర్సుల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.
Training of Unemployed Youth in Self Employed Course

మొగ‌ల్రాజ‌పురం(విజ‌య‌వాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగ యువ‌తకు ఈ నెల‌లో త‌మ సంస్థ ఆధ్వ‌ర్యంలో వివిధ స్వ‌యం ఉపాధి కోర్సుల్లో శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తామ‌ని జ‌న‌శిక్ష‌ణ సంస్థాన్ డైరెక్ట‌ర్ ఎ.పూర్ణిమ జులై 1వ తేదీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

అసిస్టెంట్ డ్ర‌స్ మేక‌ర్‌, క్రాఫ్ట్ ప్రొడ‌క్ట్ మేక‌ర్‌, బ్యూటీకేర్ అసిస్టెంట్‌, క‌ట్టింగ్ అండ్ టైల‌రింగ్‌, మెషిన్ ఎంబ్రాయిడ‌రీ, ఏసీ అండ్‌రిఫ్రిజిరేట‌ర్ రిపేరింగ్‌, హోమ్ క్రాఫ్ట్ మెకానిజం, జామ్ జ్యూస్ మేకింగ్‌, టెక్స్‌టైల్ ప్రింటింగ్‌, ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌, మిర్ర‌ర్ వ‌ర్క్‌ల్లో శిక్ష‌ణ ఇస్తామ‌ని పేర్కొన్నారు.

ఆస‌క్తిగ‌ల యువ‌తీ యువ‌కులు విజ‌య‌వాడ మొగ‌ల్రాజ‌పురం రావిచెట్టు సెంట‌ర్‌లోని త‌మ సంస్థ కార్యాల‌యంలో నేరుగా లేదా 0866 2470420 ఫోన్ నంబ‌రులో సంప్ర‌దించాల‌ని పూర్ణిమ సూచించారు. 

Anganwadi Jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

Published date : 02 Jul 2024 07:50PM

Photo Stories