Govt jobs Notification: ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

Govt jobs Notification

విజయనగరం అర్బన్‌: ఎస్సీ ఎస్టీ కులాల బ్యాక్‌లాగ్‌ పోస్టుల నియామకానికి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని సోషల్‌ వెల్ఫేర్‌ డీడీని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ఈ నెల 25లోగా ఖాళీల వివరాలు, రోస్టర్‌ పాయింట్లను, పోస్టుల విద్యార్హతలు తదితర సమాచారాన్ని అందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కమిటీ సభ్యుల విజ్జప్తి మేరకు బ్యాక్‌ లాగ్‌ పోస్టుల నియామకానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. అదే విధంగా ఖాళీగా ఉన్న తలయారీ పోస్టులను భర్తి చేయాలని సభ్యులు కోరగా నోటిఫికేషన్‌ జారీ చేయడానికి వివరాలను సేకరించాలని డీఆర్‌ఓ అనితకు సూచించారు. సమావేశంలో సహాయ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌, డీఆర్‌ఓ ఎస్‌డీ అనిత, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ దయానంద్‌, జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

#Tags