Part Time Job Fraud: గూగుల్‌ రివ్యూల పేరుతో ఐటీ ఉద్యోగినికి టోకరా

హిమాయత్‌నగర్‌: పార్ట్‌ టైం జాబ్‌గా గూగుల్‌ రివ్యూలు ఇస్తూ డబ్బు సంపాదించవచ్చని ఓ ఐటీ ఉద్యోగినిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు.

సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వివరాల ప్రకారం..నగరానికి చెందిన ఐటీ ఉద్యోగినికి వాట్సాప్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ పేరుతో మెసేజ్‌ వచ్చింది. అందులో పలు యాప్‌లకు (అప్లికేషన్‌) గూగుల్‌ రివ్యూలను ఇవ్వడానికి బాధితురాకి నేరగాళ్లు టాస్క్‌లు ఇచ్చారు. ఈ టాస్కులు పూర్తి చేస్తే ఒక్కో టాస్క్‌కు రూ.300 చెల్లిస్తామన్నారు. తనకు 21 టాస్క్‌ల డబ్బు డిపాజిట్‌ చేయడానికి బాధితురాలి బ్యాంక్‌, యూపీఐ వివరాలను అడిగారు.

బాధితురాలిని నమ్మించడానికి ఆమె అకౌంట్‌కు కొంత డబ్బును పంపించారు. అనంతరం బాధితురాలిని పెట్టుబడులు పెట్టాలన్నారు. వారు చెప్పిన విధంగా మొదట కొంతమొత్తాన్ని పెట్టుబడి పెట్టింది. అనంతరం తప్పుగా పెట్టుబడి పెట్టారని, దీంతో అకౌంట్‌ స్తంభించిపోయిందని, దాన్ని డీఫ్రీజ్‌ చేయడానికి మళ్లీ డబ్బు చెల్లించాలన్నారు. ఈ విధంగా బాధితురాలి వద్ద నుంచి మొత్తం రూ.3,57,335 సైబర్‌ కేటుగాళ్లు కాజేశారు. దీంతో బాధిరాలు నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.

చదవండి: AICTE: ఒత్తిడి తగ్గాలి.. నైపుణ్యం పెరగాలి.. ప్రతి కాలేజీలో ఈ నిపుణుల నియామకం

ఆధార్‌ మొబైల్‌కు లింక్‌ చేయాలంటూ...

మరో కేసులో ఓ మహిళకు సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ కాల్‌ చేసి తమ ఆధార్‌ కార్డ్‌ మొబైల్‌కు లింక్‌ అవ్వలేదని, వెంటనే లింక్‌ చేయాలని ఆమె ఫోన్‌కు ఓ లింక్‌ పంపించారు. ఆ లింక్‌ ఓపెన్‌ చేయగానే బాధితురాలి ఫోన్‌ హ్యాంగ్‌ అయింది. దీంతో ఆమె తన భర్త ఫోన్‌ నుండి వారికి మళ్లీ కాల్‌ చేసి తన మొబైల్‌ హ్యాంగ్‌ అయిందని తెలిపింది. దీంతో కేటుగాళ్లు తన సిమ్‌ బ్లాక్‌ అయిందని చెప్పి, తన భర్త నంబర్‌కు ఓటీపీ వచ్చిందని అది చెప్పమన్నారు.

చదవండి: Cyber Theft Awareness: పార్ట్‌టైం జాబ్‌ పేరుతో రూ.91,991 స్వాహా

ఓటీపీ చెప్పడంతో బాధితురాలి అకౌంట్‌తో పాటు ఆమె భర్త అకౌంట్‌ నుంచి రూ.1.28 లక్షలు డెబిట్‌ అయ్యాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో బాధితురాలు వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు.
 

#Tags