jobs news: జపాన్‌లో ఉద్యోగావకాశాలు
రాయచోటి (జగదాంబసెంటర్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎన్‌ఏవీఐఎస్ హెచ్‌ఆర్ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్ చదివిన వారికి జపనీస్‌బాష నేర్పడంతో పాటు జపాన్ దేశంలో నర్సులుగా ఉద్యోగావకాశం కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి మహిళకు 5లక్షల..దరఖాస్తు చేసుకున్న 2రోజుల్లోనే డబ్బు: Click Here
32 సంవత్సరాలలోపు వయస్సు కలిగి జపాన్ దేశంలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణ కాలం 6 నెలలని, శిక్షణ ఎన్‌ఏవీఐఎస్ హెచ్‌ఆర్ బెంగళూరులో జరుగుతుందని తెలిపారు. శిక్షణ రుసుం రూ.3 లక్షలు కాగా పాక్షిక శిక్షణ రుసుము రూ.50 వేలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రూ.25 వేలు చెల్లిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9988853335 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలియజేశారు.