Skip to main content

Good News For Womens: తెలంగాణలో ప్రతి మహిళకు 5లక్షల..దరఖాస్తు చేసుకున్న 2రోజుల్లోనే డబ్బు

Telangana every womens Free 5lakhs Rupees
Telangana every womens Free 5lakhs Rupees

మహిళలకు మనీ ఇస్తే, దాని వల్ల ఎలాంటి నష్టమూ ఉండదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. పైగా మన తెలుగు రాష్ట్రాల మహిళలు.. తమ చేతికి వచ్చే ప్రతీ రూపాయినీ జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు. పొదుపు బాగా చేస్తూ, అప్రమత్తంగా పెట్టుబడులు పెడుతూ.. ఏం చేసినా విజయవంతంగా చేస్తున్నారు. వారి కోసమే రూ.5 లక్షలు. పూర్తి వివరాలు ఇవీ.

Telangana Contract Basis Jobs: Click Here

తెలంగాణలో మహిళలు జస్ట్ 2 రోజుల్లో రూ.5 లక్షల వరకూ రుణం పొందే వీలు ఉంది. ఇందుకోసం ప్రభుత్వం మహిళలకు స్త్రీ నిధి సంస్థ ద్వారా నిధులు ఇప్పిస్తోంది. ఈ రుణం పొందాలంటే డ్వాక్రా సంఘాల్లో చేరాల్సి ఉంటుంది. స్త్రీ నిధి కింద మహిళలు.. బ్యాంకుల్లో వెంటనే రుణం పొందగలరు. అప్లై చేసుకున్న 48 గంటల్లోనే మనీ వారి బ్యాంక్ అకౌంట్‌లోకి వస్తుంది.

మహిళల కోసం 2011లో స్త్రీ నిధిని ప్రారంభించారు. అప్పటినుంచి స్వయం సహాయక సంఘాల్లో మహిళలు రుణాలు పొందుతున్నారు. ఈ స్త్రీ నిధిలో 4 రకాలు ఉన్నాయి. అవి సువిధ, ప్రగతి, అక్షయ, సౌభాగ్య. ఈ కేటగిరీల కింద రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు లోన్ ఇస్తున్నారు. ఐతే, ఇదేమీ వడ్డీ లేని రుణం కాదు. లోన్ తీసుకున్న వారు టైమ్ ప్రకారం చెల్లిస్తే, వారికి వడ్డీ పావలా (25 పైసలు) మాత్రమే పడుతుంది. సాధారణంగా బ్యాంకులు ఇచ్చే వడ్డీతో పోల్చితే, ఇది చాలా తక్కువే. అందుకే ఈ రుణాలు ఫేమస్.

స్త్రీ నిధి కింద రుణం తీసుకునే మహిళలు, సొంత వ్యాపారం, చిన్న పరిశ్రమలు, వ్యాపార విస్తరణ ఇలా తమ ప్లాన్‌కి తగినట్లుగా వాడుకొని.. పెట్టుబడిలాగా మార్చుకోవాలి. తద్వారా ఆదాయం వచ్చేలా చేసుకోవాలి. అలా వాయిదాల పద్ధతిలో రుణం తిరిగి చెల్లించవచ్చు. ఇలా ఈ రుణం.. మహిళలు మరింతగా దూసుకెళ్లేందుకు వీలు కల్పిస్తోంది.

స్వయం సహాయక బృందాలు (SHG), మహిళా సంఘాల్లో సభ్యులు ఈ రుణాలు తీసుకోవచ్చు. తెలంగాణలో స్త్రీ నిధి సంస్థలో 60 లక్షల మందికి పైగా సభ్యులుగా ఉన్నారని సమాచారం. ఈ సంస్థలో మహిళా సంఘాలతోపాటూ.. గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యలు, పట్టణ సమాఖ్యలు కూడా భాగంగా ఉన్నాయి. తెలంగాణలో ఈ సంస్థ అభివృద్ధిని చూసి, బీహార్ ప్రభుత్వం కూడా.. తమ రాష్ట్రంలో ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించుకుంది.

స్త్రీ నిధి పుణ్యమా అని కోళ్ళ పెంపకం, పాడి పశువుల పెంపకం, ఆటోల నిర్వహణ, ఎలక్ట్రిక్ ఆటోల నిర్వహణ, కిరాణా షాపులు, టైలరింగ్ షాపులు.. ఇలా చాలా వాటికి తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తున్నాయి. కనీసం 5 వేల రుణం కావాలన్నా కూడా.. ఈ సంస్థ ద్వారా పొందవచ్చు. స్త్రీ నిధిలో అప్పు తీసుకునేందుకు అదనపు ఛార్జీలేవీ ఉండవు. రహస్య ఫీజులు ఉండవు. అందువల్ల మహిళలకు ఇది మంచి సంస్థగా మారింది.

స్త్రీ నిధి సంస్థ మొత్తం 65 రకాల వ్యాపారాలూ, యూనిట్లు ప్రారంభించుకోవడానికి రుణం ఇస్తోంది. వాటిలో పేపర్ ప్లేట్ల తయారీ, పౌల్ట్రీ, పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, మొబైల్ ఫోన్ రిపేరింగ్, సెలూన్, బ్యూటీ పార్లర్, ఫ్యాన్సీ స్టోర్స్, టైలరింగ్ షాపు, కూరగాయల అమ్మకం, కిరాణ స్టోర్, గాజుల షాపు, బేకరీ షాప్, జిరాక్స్, డెకరేషన్ అండ్ లైటింగ్ సర్వీస్, లాండ్రీ, ఫొటో స్టూడియో, చేపల అమ్మకం, ఇటుకల తయారీ, కార్పెంటరీ, సెంట్రింగ్, ఇంటర్నెట్, వెల్డింగ్ వంటివి ఉన్నాయి.

స్త్రీ నిధి ద్వారా వచ్చే లాభాలలో 45 శాతాన్ని సంఘాల సామార్ధ్యాన్ని పెంపొందించేందుకు, 2 శాతం స్కాలర్ షిప్‌గా ఇస్తున్నారు. ఇంటర్ చదివే సంఘం సభ్యుల పిల్లలకు రూ.2,500 ఉపకారవేతనం ఇస్తున్నారు. స్త్రీనిధిలో రుణం పొందిన వారికి సురక్ష బీమా పథకం కింద, ఒక లక్ష వరకు జీవిత బీమా అమలులో ఉంది. ఇలా ఈ సంస్థ ద్వారా బ్యాంకుల్లో రుణం పొందే సభ్యులు అన్ని రకాలుగా ఆర్థికంగా దూసుకెళ్తున్నారు.
 

Published date : 12 Sep 2024 05:37PM

Photo Stories