Self Employment for Women: మహిళలకు Good News ఉచితంగా కుట్టుమిషన్‌లు
కేంద్రంలో మూడోసారి NDA ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో.. ఆల్రెడీ అమలు చేస్తున్న పథకాలను కొనసాగించేలా ప్లాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళలకు, పురుషులకు ఉచితంగా కుట్టుమిషన్ (sewing machine) ఇచ్చే పథకాన్ని కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికే చాలా మంది పొందారు. మరింత మందికి ఇస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Click Here: Womens job Mela: Good News మహిళలకు జాబ్‌మేళా
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వృత్తులు చేసే వారికి ప్రత్యేక పనిముట్లు, యంత్రాలను ఇస్తోంది. ఐతే, వాటిని కేంద్రం ఇవ్వకుండా, మనీ ఇస్తూ, ఆ డబ్బుతో కొనుక్కునేలా చేస్తోంది. కుట్టు మిషన్ కూడా ఇదే టైపు. కేంద్రం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన (pradhan mantri vishwakarma yojana) అనే పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకంలో భాగంగా.. కుట్టుమిషన్ కొనుక్కునేందుకు రూ.15,000 పొందవచ్చు. ఈ డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో వేస్తుంది. అలాగే ఓ వారం డిజిటల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఆ సమయంలో రోజుకు రూ.500 చొప్పున మనీ ఇస్తుంది.
కుట్టుమిషన్ కొనుక్కున్న తర్వాత.. కేంద్రం 1 లక్ష రూపాయలు రుణం ఇప్పిస్తుంది. ఈ రుణాన్ని 18 నెలల్లో చెల్లించవచ్చు. రుణం చెల్లించాక మరో 2 లక్షల దాకా రుణం తీసుకోవచ్చు. దాన్ని 30 నెలల్లో చెల్లించాలి. ఇలా కేంద్రం కుట్టుమిషన కొనుక్కునేవారు.. షాపు పెట్టుకునేందుకు ఈ రుణం ఇప్పిస్తోంది. ఈ రుణాలకు వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే.. రుణాలకు అప్లై చేసుకునే క్రెడిట్ గ్యారెంటీ ఫీజును కేంద్రమే చెల్లిస్తుంది. మహిళలే కాదు పురుషులు కూడా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం ఎలా పొందాలో తెలుసుకుందాం.
ఉచిత కుట్టు మిషన్ పథకానికి అర్హతలు:
ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరులు అయి ఉండాలి. ఇప్పటికే కుట్టుపని చేస్తున్న వారు మాత్రమే ఉచిత కుట్టు మిషన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్‌గా పనిచేసే ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి.
ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం అవసరమైన పత్రాలు:
ఈ పథకం కోసం అప్లై చేసుకునేవారు ఆధార్ కార్డు, చిరునామా రుజువు, గుర్తింపు కార్డు, కుల ధృవీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటో, మొబైల్ నంబర్, బ్యాంకు పాస్ బుక్ కలిగివుండాలి.
ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా అధికారిక https://pmvishwakarma.gov.in లోకి వెళ్లాలి. ఇందులో రిజిస్టర్ అవ్వాలి. మీరు ఆన్‌లైన్‌లో కుదరదు అనుకుంటే మీ దగ్గర్లోని మీ సేవా కేంద్రానికి వెళ్లి, చేయించుకోవచ్చు. మీరు పైన చెప్పుకున్న పత్రాలను మీ దగ్గర ఉంచుకోవాలి. మీ దరఖాస్తు అప్లై చేశాక, మీకు రసీదు వస్తుంది. ఆ రసీదును మీ దగ్గర ఉంచుకోవాలి. ఆ తర్వాత కొన్ని రోజులకు కేంద్రం మీ బ్యాంక్ అకౌంట్‌లో మనీ జమ చేస్తుంది. తద్వారా మీరు కుట్టు మిషన్ కొనుక్కోవచ్చు.
Tags
- Good News For Womens PM Modi Free sewing machines
- Free sewing machines
- womens Free news
- Good news for Womens
- PM Modi Free news
- Good news for mens
- Self Employment for Women
- free tailoring machine
- Free news
- Latest Free News
- free
- free silai machine
- pm vishwakarma yojana news
- machine beneficieries for womens
- Free sewing machine scheme
- Modi Free Scheme news
- women works news
- Work for Womens
- Latest Free news for womens
- Trending Free News for womens
- womens latest news
- central government Free Schemes for womens
- news updates
- news today
- Latest News in Telugu
- Telugu News
- PradhanMantriVishwakarmaYojana
- SewingMachineScheme
- FreeSewingMachine
- GovernmentSchemes
- WomenEmpowerment
- MenEmpowerment
- SkillDevelopment
- FinancialAid
- EconomicSupport
- PMVishwakarmaYojana
- ArtisanSupport
- SewingMachineDistribution
- LivelihoodSupport
- GovernmentAssistance
- EmpowermentSchemes
- sakshieducationlatest news