Free training for Tally and Python courses: ట్యాలీ, పైతాన్ కోర్సులకు ఉచిత శిక్షణ
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో రెండు నెలల కాలపరిమితి కలిగిన స్వయం ఉపాధి కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పీఎస్‌ఎస్‌ఆర్ లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీ క్లర్క్ ఉద్యోగాలు.. జీతం 32వేలు: Click Here
అకౌంట్స్ అసిస్టెంట్(ట్యాలీ) కోర్సుకు బీకాం, పైతాన్ కోర్సుకు ఏదేని డిగ్రీ, బేసిక్ కంప్యూటర్స్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) కోర్సుకు ఇంటర్మీడియట్, ఆటోమోబైల్ టూ వీలర్ సర్వీసింగ్ కోర్సుకు పదో తరగతి విద్యార్హత కల్గి ఉండాలని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు నెలకు రూ.3900 ఫీజుతో భోజనంతో కూడిన హాస్టల్‌వసతి కల్పించబడుతుందని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకొన్న అభ్యర్థులకు తప్పనిసరిగా ఉద్యోగం కూడ కల్పిస్తామని తెలిపారు.
ఆసక్తి కల్గిన అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో ఈ నెల 28న సంస్థలో నిర్వహించే కౌన్సిలింగ్‌కు నేరుగా హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాలకు 9133908000, 9133908111 నంబర్లను సంప్రదించాలని సూచించారు.