Skip to main content

IOCL Junior Business Assistant Jobs: 10వ తరగతి అర్హతతో IOCLలో జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 1లక్ష 5,000

IOCL jobs  IOCL recruitment 2025  notification for 246 posts   Junior Operator, Junior Attendant, Junior Business Assistant jobs at IOCL
IOCL jobs

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 246 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 3, 2025న ప్రారంభమవుతుంది. 23, ఫిబ్రవరి వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.

హైదరాబాద్ పంచాయతీ రాజ్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు జీతం నెలకు 75,000: Click Here


మొత్తం పోస్టులు : 246

IOCL Recruitment 2025 ద్వారా జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను దేశం మొత్తం భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

జూనియర్ ఆపరేటర్ : IOCL లో జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతితో పాటు ITI ఉత్తీర్ణత సాధించాలి. మరియు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

జూనియర్ అటెండెంట్ : IOCL Recruitment 2025 జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్ పాసై ఉండాలి.

జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ : IOCL Recruitment 2025 జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. MS Word, MS Exel, Power Point పై నాలెడ్జ్ ఉండాలి.

వయోపరిమితి :

IOCL లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

IOCL Recruitment 2025 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్గ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

జీతం : జూనియర్ ఆపరేటర్ మరియు జూనియర్ అటెండెంట్ ఉద్యోగాలకు రూ.23,000 నుంచి రూ.78,000 జీతం ఇస్తారు. జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.25,000 నుంచి రూ.1,05,000 జీతం చెల్లిస్తారు.

అప్లికేషన్ ఫీజు :

IOCL Recruitment 2025 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి రూ.300 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజులను ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 23 ఫిబ్రవరి 2025

Notification : Click Here

Published date : 13 Feb 2025 08:57AM

Photo Stories