Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Free training in tailoring

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత మహిళలకు కెనరా బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఎంబ్రాయిడరీ (జర్దోసి మగ్గం), ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ బి.శివప్రసాద్‌ తెలిపారు.

జూన్‌ 19 నుంచి 30 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు చదవడం, రాయడం వచ్చిన మహిళలు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్‌ వసతి కల్పిస్తామన్నారు. వివరాలకు 63044 91236 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

#Tags