Free Civils Coaching in Hyderabad: హైదరాబాద్‌లో ఉచిత సివిల్స్‌ శిక్షణ

Free Civils Coaching in Hyderabad

కాళోజీ సెంటర్‌: సివిల్స్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి సి.భాగ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉచిత శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా వంద మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు.

Anganwadi teachers workers news: అంగన్‌వాడీ టీచర్లకు, వర్కర్లకు గుడ్‌న్యూస్‌..

ఏదైనా డిగ్రీ /ప్రొఫెషనల్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఆసక్తి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ–ఈ, దివ్యాంగులు జూలై 10లోగా htttp:// tsstudycircle. co. in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు జూలై 21న హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ కేంద్రాల్లో ఎంపిక పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 81216 26423 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

#Tags