Job Offer with Course: ముగిసిన ప్రవేశ పరీక్షల దరఖాస్తులు.. ఈ కోర్సులతో ఉద్యోగాలు సాధిస్తే..!

విద్యార్థులు ఇంటర్‌, డిగ్రీ కోర్సుల తరువాత ఉద్యోగాల కోసం వేచి చూసేకన్న పదో తరగతి పూర్తి అయిన అనంతరం ఉద్యోగం సాధించాలనుకుంటున్నారు. అటువంటి వారికోసమే ఈ అవకాశం. పదో తరగతి పాసైన విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. కోర్సు, ఉద్యోగావకాశంకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా..

కడప: పదవ తరగతి తరువాత వీలైనంత తొందరగా ఉద్యోగం సంపాదించాలనుకునేవారికి పాలిటెక్నిక్‌ కోర్సులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. పదవ తరగతి అనంతరం ఇంటర్‌, డిగ్రీ, కోర్సులు చేయడం సాధారణం. అయితే, డిగ్రీ పూర్తయ్యి ఉద్యోగం వచ్చేంత సమయం లేకపోవడంతో చాలామంది పాలిటెక్నిక్‌ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. పదవ తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిసెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది.

Election Commission: ‘యూత్‌ ఐకాన్‌’గా ఆయుష్మాన్‌ ఖురానా

ఈ పరీక్షలలో ఉత్తమ ర్యాంకు సాధించిన వారికి రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్‌ కళాశాలల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి. ఇటీవలే పదవ తరగతి పరీక్షలు కూడా ముగిశాయి. త్వరలో ఫలితాలను కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది. పదవ తరగతి విద్యార్థులంతా పాలిసెట్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు.

పాలిటెక్నిక్‌ కళాశాలలు, అక్కడి సీట్ల సంఖ్య ఇంత..

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు: 10

ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు : 18

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అందుబాటులో ఉన్న సీట్లు: 2316

ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలో అందుబాటులో ఉన్న సీట్లు: 5340

Devika AI: ఇండియన్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ‘దేవిక’

ఉద్యోగ అవకాశాలు మెండు

పదవ తరగతి చదివిన వెంటనే సాంకేతిక విద్య చదవాలనే గ్రామీణ పేద విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కోర్సు ఒక గొప్ప అవకాశం. ఇంజనీరింగ్‌ వంటి అత్యున్నత సాంకేతిక విద్య అభ్యసించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. పాలిటెక్నిక్‌లో ఏ కోర్సు చేసినా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. దీంతో భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం సులభంగా లభిస్తుంది. ఇటీవలే వివిధ సంస్థలు నేరుగా కళాశాలలకు వెళ్లి పాలిటెక్నిక్‌ చివరి సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులను తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఆయా కళాశాలల్లో జాబ్‌ మేళాలు కూడా ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

IIIT Bangalore Students: అంధ విద్యార్థులకు అర్థమయ్యేలా చేతి వేలిపై పాఠ్యాంశాలు

10వ తేదీతో ముగిసిన పాలిసెట్‌కు తుది గడువు

ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు పాలిసెట్‌ పరీక్ష రాయాల్సిందే. పాలిసెట్‌ దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 10వ తేదీ (నిన్నటి)తో గుడువు ముగిసింది. ఈ నెల 27వ తేదీన పాలిసెట్‌ ప్రవేశ పరీక్షను కూడా నిర్వహించనున్నారు. ఈ పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో గణితం 50 మార్కులకు, ఫిజిక్స్‌ 40 మార్కులకు, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉంటుంది. పదవ తరగతి సిలబస్‌ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం కడప, ప్రొద్దుటూరులలో పరీక్షా కేంద్రాలను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించిన ఫలితాలు మే నెలలో 25న విడుదల చేస్తారు. జూన్‌ నాలుగో వారం నుంచి ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు.

APPSC Group 2 Prelims Results 2024 Released : బ్రేకింగ్ న్యూస్‌.. గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల‌.. మెయిన్స్ ప‌రీక్ష తేదీ ఇదే..

లభించే కోర్సుల వివరాలు ఇలా...

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సివిల్‌, మెకానికల్‌ , ట్రిపుల్‌ ఈఈ, కంప్యూటర్‌ మెకానిక్‌, ఈసీఈ, ఎంఈసీలతోపాటు ఒకటి రెండు కొత్త కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 30 నుంచి 120 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. ఉమ్మడిజిల్లా మొత్తంపైన ప్రభుత్వ, ప్రైవేటు కలిసి 28 పాలిటెక్నిక్‌ కళాశాలకుగాను 7656 సీట్లు అందుబాటలో ఉన్నాయి.

కడప మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో...

ఈ నెల 27వ తేదీ నిర్వహించనున్న పాలిసెట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉచితంగా కోచింగ్‌ను అందిస్తున్నారు. ఈ కోచింగ్‌కు కడప నగరంతో పాటు పలు గ్రామీణ ప్రాంతం నుంచి దాదాపు 200 మంది విద్యార్థులు వస్తున్నారు. వీరికి ఉదయం నుంచి బోధనలను అందిస్తున్నారు. దీంతోపాటు కోచింగ్‌ కోసం వచ్చిన విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్‌ను కూడా అందించారు.

Students Health: గురుకుల విద్యార్థులు డీ-హైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేలా ఈ చర్యలు..

ర్యాంకు సాధిస్తాం..

ఈ నెల 27వ తేదీ నిర్వహించే పాలిసెట్‌లో తప్పకుండా ర్యాంకును సాధిస్తాం. మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇస్తున్న కోచింగ్‌ నాకు బాగా ఉపయుక్తంగా ఉంది. బాగా చదువుకుంటున్నాను. తప్పకుండా ర్యాంకు సాధిస్తా.

– అరుణ్‌, విద్యార్థి, కోడూరు

చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు

పదో తరగతి తర్వాత తక్కువ ఫీజులతో సాంకేతిక విద్య లభించే కోర్సు పాలిటెక్నిక్‌. ఈ కోర్సు చేయడం ద్వారా విద్యార్థుల భావి జీవితానికి బంగారు బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. కళాశాలల్లో నిర్వహించే జాబ్‌ మేళా, క్యాంపస్‌ ఇంటర్వూలలో పెద్ద పెద్ద సంస్థలు నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసుకుని ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.

 – సీహెచ్‌ జ్యోతి, ప్రిన్సిపాల్‌ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల, కడప

Kendriya Vidyalaya Admission 2024-25: నాణ్యమైన విద్యకు కేరాఫ్‌.. కేవీలు!

#Tags