Students Health: గురుకుల విద్యార్థులు డీ-హైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేలా ఈ చర్యలు..
నేలకొండపల్లి: ఎండలు పెరుగుతున్న దృష్ట్యా సంక్షేమ శాఖల్లోని గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వేడి నుంచి విద్యార్థులను సంరక్షించేందుకు సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 14 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు పూర్తికాగా, ఖమ్మంలోని అంబేద్కర్ కాలేజీలో మాత్రం ప్రత్యేక శిక్షణ కోసం విద్యార్థులు ఉన్నారు.
Kendriya Vidyalaya Admission 2024-25: నాణ్యమైన విద్యకు కేరాఫ్.. కేవీలు!
ఈ మేరకు విద్యార్థులు డీ హైడ్రేషన్‌కు గురికాకుండా గంటగంటకు బెల్ కొట్టి నీరు తాగేలా చూడాలని, మధ్యలో నిమ్మరసం ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, ఉల్లిగడ్డ, అల్లం, జిలకర పొడి, కొత్తిమీర కలిపి చేసిన మజ్జిగ సరఫరా చేయాలని, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపించొద్దని, తరగతి గదులు, డైనింగ్ హాల్‌లో కుండల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ మేరకు నేలకొండపల్లి గురుకులంలో విద్యార్థులకు మజ్జిగ అందిస్తుండగా, తాగునీటి కోసం ప్రతీ గంటకోసారి విరామం ఇస్తున్నామని ఇన్‌చార్జ్ ప్రిన్సి పాల్ ప్రమీల తెలిపారు.
Women Industrialists: మహిళల కోసం బిజ్ మేళా.. స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి..