Skip to main content

IIIT Bangalore Students: అంధ విద్యార్థులకు అర్థమయ్యేలా చేతి వేలిపై పాఠ్యాంశాలు

Curriculum at fingertips for blind students to understand

తరగతి గదిలో చెప్పే పాఠ్యాంశాలను అంధ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చేసే కొత్త సాంకేతికతను ట్రిపుల్‌ ఐటీ బెంగళూరుకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు. దీని ద్వారా అధ్యాపకులు బోర్డుపై వివరించే అంశాలు అంధ విద్యార్థులకు చేతి వేళ్లపై అర్థమవుతాయి. ఇందుకోసం ఒక చిన్న పరికరాన్ని చేతి వేలికి పెట్టుకోవాలి. తరగతి గదిలో సాధారణ బోర్డు కాకుండా స్మార్ట్‌బోర్డు ఉండాలి. వైఫై ద్వారా బోర్డుకు, విద్యార్థి చేతి వేలికి ఉండే పరికరం అనుసంధానమై పని చేస్తుంది. అధ్యాపకులు బోర్డుపై రాసిన వాటిని చేతివేలికి ఉన్న పరికరం విద్యార్థితో డెస్కుపై రాయిస్తుంది. కంప్యూటర్‌ మౌస్‌ను వినియోగించేటప్పుడు చేతివేళ్లు ఎలా కదులుతాయో ఈ పరికరం ద్వారా కూడా అలానే కదులుతాయి. ఇందులో బ్రెయిలీ సెన్సార్‌ కూడా ఉంటుంది. కాబట్టి అంధ విద్యార్థులకు సులువుగా అర్థమవుతుంది. 
 

చదవండి: April 8th Current Affairs GK Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Apr 2024 06:27PM

Photo Stories