Employment Registration Drive: ప్ర‌భుత్వ మహిళా డిగ్రీ క‌ళాశాల‌లో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేష‌న్ డ్రైవ్‌!

Employment Registration Drive

శ్రీకాకుళం: టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఐటీఐ, ఇలా విద్యార్హతలు కలిగిన ప్రతిఒక్కరూ ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్‌) కళాశాలలో గురువారం ‘ఎంప్లాయిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ డ్రైవ్‌’ను నిర్వహించారు. కళాశాల రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ పి.సూర్యసునీత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సూర్యచంద్రరావు అధ్యక్షన జరిగింది.

NMDC లో భారీగా జూనియర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు జీతం 50వేలు: Click Here

ఈ సందర్భంగా సుధ మాట్లాడుతు ప్రతి విద్యార్థి పదో తరగతి పూర్తయిన వెంటనే, ఎంప్లాయిమెంట్‌ కోసం ‘స్టేట్‌ పోర్టల్‌’, ‘నేషనల్‌ కెరీర్‌ ఫర్‌ సర్వీసెస్‌’ వంటి పోర్టల్స్‌లో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి రెన్యువల్‌ చేసుకోవాలని, సమయానికి చేసుకోకపోతే ఆరు నెలలు గ్రేస్‌ పీరియడ్‌, రెన్యువల్‌ చేసుకోకపోతే మళ్లీ మొదటి నుంచి ప్రాసెస్‌ చేసుకోవాలని అన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags