Certificate Courses: 30 రోజులపాటు సర్టిఫికెట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ..
స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశంగా ఈ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నారు సంస్థ. అర్హత, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు..
అనకాపల్లి: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారిలో భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో విశాఖ ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులకు (పురుషులకు) ఈనెల 26 నుంచి ద్విచక్ర వాహనాలు, విద్యుత్ హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ 30 రోజుల పాటు ఇవ్వడం జరుగుతుందని సంస్థ డైరెక్టర్ బి.విజయ్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Free Training for Women: నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ.. దరఖాస్తు వివరాలు..
శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించి, శిక్షణానంతరం సర్టిఫికెట్, టూల్ కిట్ బ్యాక్స్‌తో పాటు బ్యాంకు ద్వారా రుణసౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు. 19 నుంచి 45 సంవత్సరాలు గల అభ్యర్థులు ఆధార్‌కార్డు, తెల్లరేషన్‌కార్డు కలిగిఉండాలని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8008333509 నంబరును సంప్రదించాలన్నారు.
#Tags