Surveyor Jobs Recruitment: 10వ తరగతి అర్హతతో తెలంగాణలో 1000 సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ

Land surveyor jobs

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్రంలో రెవిన్యూ శాఖలో సర్వేయర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు.

SSC Exams: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు గడువు పొడగింపు: Click Here

ప్రస్తుతం రాష్ట్రంలో 982 మంది సర్వేయర్ల పోస్ట్లు వుండగా 242 మంది మాత్రమే వున్నారు. రాష్ట్రంలో రెండు మూడు నెలల్లో 1000 మంది సర్వేయర్లు ను నియమించనున్నారు. పెద్ద మండలాలకు ఇద్దరు చొప్పున సర్వేయర్ లను కేటాయించనున్నారు.

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేయనుంది.

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 1000

భర్తీ చేయబోయే ఉద్యోగాలు: సర్వేయర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత తో పాటు ఐటిఐ సివిల్ డ్రాఫ్ట్మెన్ సర్టిఫికెట్ సాధించి వుండాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.

వయస్సు:
18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు కలదు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థులను ఓ ఎం ఆర్ ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన అంశాలు: 
ఈ ఉద్యోగాలకు సంబంధించి మరి కొద్ది రోజులలో నోటిఫికేషన్ విడుదల కానుంది.
అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత సమాచారాన్ని అంతా చదివి , అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోగలరు.

#Tags