Vegetable Vendor Son Cracks CA Exam: కూరగాయలమ్మే తల్లి.. కొడుకు సీఏలో ఉత్తీర్ణత సాధించడంతో..

ప్రాణానికిప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డలు, తమ కలలకు ప్రతిరూపాలుగా ఎదిగితే అంతకంటే సంతోషం తల్లిదండ్రులకు ఇంకేముంటుంది. అందులోనూ కాయకష్టం చేసి మరీ చదివించుకునే బిడ్డలు తాము అనుకున్నదానికంటే మిన్నగా  రాణిస్తే గుండెల్లోని ఆనందంతా తల్లి మనసు కన్నీటి ధారగా వర్షిస్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే మహారాష్ట్ర లోథానేలోని డోంబివిలి (తూర్పు)లో చోటు చేసుకుంది.

Post Office Jobs: రాతపరీక్ష లేకుండానే పోస్టాఫీస్‌లో 44వేలకు పైగా ఉద్యోగాలు.. జీతం నెలకు రూ. 30వేల వరకు

వివరాల్లోకి వెళితే..థానేలోని డోంబివిలి (తూర్పు)లో కూరగాయల వ్యాపారంతో జీవించే థోంబ్రే మావ్షి  కుమారుడు యోగేష్ ఇటీవల చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఈ శుభవార్తను తన తల్లితో పంచుకోగానే ఆమె కుమారుడిని కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. బ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ ఎక్స్‌లో వీడియోను పంచుకున్నారు.

IISER Triupati Launches Masters Programmes: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌లో శిక్షణ.. చివరి తేదీ ఇదే

యోగేష్, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను.  బలం, దృఢ సంకల్పం, కష్టపడి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించాడు అంటూ యోగేష్‌ను అభినందించారు. 45 సెకన్ల వీడియో నెటిజనుల మనసు దోచుకుంది.

 

#Tags