Teaching Language : పాఠ‌శాల‌ల్లో బోధ‌న మాతృభాష‌లో కొన‌సాగేలా చ‌ర్య‌లు తీసుకోవాలి..

కొత్తచెరువు: ప్రాథమిక పాఠశాలలో బోధన మాతృభాషలోనే కొనసాగేలా చూడాలని ప్రభుత్వాన్ని ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్‌ కుమార్‌ మాట్లాడారు. విద్యావ్యవస్దకు నష్టం చేకూర్చేలా ఉన్న జీఓ 117ను వెంటనే రద్దు చేసి ప్రాథమిక విద్యా వ్యవస్దను బలోపేతం చేయాలన్నారు.

ISTE Awards : ఐఎస్‌టీఈ అందించే అవార్డుల‌కు ఎంపికైన జేఎన్‌టీయూ ప్రొఫెస‌ర్లు వీరే..

6 నుంచి 10 తరగతులకు తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమంలో బోధన కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కోడూరు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్ర, గౌరవ అధ్యక్షుడు పి.వి.మాధవ, సభ్యులు లతారామకృష్ణా, అంజనమూర్తి, రవీంద్రారెడ్డి, వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MHT CET 2024 Results Out: మహారాష్ట్ర టెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ ఫలితాల్లో విక్రమ్‌ షాకు 100 పర్సంటైల్‌.. కుటుంబంలో అందరూ డాక్టర్లే..

#Tags