David Marjot: చ‌దువుకు వ‌య‌సుతో సంబంధం లేదు.. 95 ఏళ్లలో డిగ్రీ పట్టా.. ఎవ‌రికంటే..!

చ‌దువుకు వ‌య‌సుతో సంబంధం లేద‌ని ఓ వ‌`ద్ధుడు నిరూపించాడు.

లండన్‌లోని సర్రేలో నివసిస్తున్న డేవిడ్ మార్జోట్ 95 ఏళ్ల వయసులో కింగ్ స్టన్ విశ్వవిద్యాలయం నుంచి మాడరన్ యూరోపియన్ ఫిలాసఫీలో ఎంఏ పూర్తి చేసి రికార్డు స‌`ష్టించాడు. ఈ విష‌యాన్ని యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. మరొక కోర్సు చదివేందుకు కూడా మార్జోట్ ప్రయత్నిస్తున్నాడు. 

ఇప్ప‌టివ‌రకు 1994లో 93 సంవ‌త్స‌రాల వ్య‌క్తిపై ఉన్న రికార్డును డేవిడ్ మార్జోట్ బ్రేక్ చేశాడు. అలాగే 2021లో 96 ఏళ్ల వయసులో ఆర్చివైట్ అనే వ్యక్తి బ్రైటన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడు అయ్యాడు. పట్టా ప్రదానోత్సవం నాడు మార్జోట్ మాట్లాడుతూ ఒక రంగంలో ఆసక్తి ఉంటే వయసుతో సంబంధం లేద‌న్నారు. 

IIT JEE vs UPSC: JEE కంటే UPSCనే కష్టం.. నెట్టింట చ‌ర్చ‌.. దీనికి ఆనంద్ మహీంద్రా ఏమ‌న్నారంటే..!

#Tags