NEET Results 2024 : నీట్ ఫ‌లితాల్లో 67 మంది విద్యార్థుల‌కు తొలి ర్యాంకు.. మ‌రి రీ-టెస్ట్‌లో వీరికి..

మే 5న నీట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.. 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు 24 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇందులో 14 కేంద్రాలు విదేశాల్లో ఉన్నాయి. సుప్రీం విచారణలో భాగంగా నగరాలు, పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) శనివారం వెల్లడించింది.

Covid 19: కోవిడ్‌ 19 మరణాలు భారత్‌లోనే ఎక్కువ.. ఖండించిన కేం‍ద్రం

అయితే, జూన్ 4న విడుద‌ల చేసిన‌ ఫ‌లితాల్లోకొస్తే మాత్రం.. ఒకే కేంద్రం నుంచి రాసినవారికి 720కి 720 మార్కులు వ‌చ్చాయి. అదే విధంగా దేశ‌వ్యాప్తంగా 67 మంది విద్యార్థుల‌కు ఫ‌స్ట్ ర్యాంకు వ‌చ్చింది. 1563 మందికి గ్రేస్ మార్కులు రావ‌డం. వీట‌న్నింటి కార‌ణంగా నీట్‌ ఫలితాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి.

National Education Policy: జాతీయ విద్యా విధానానికి నాలుగేళ్లు.. నేటి నుంచి పాఠశాలల్లో ‘శిక్షా సప్తాహ్‌’

అయితే, సుప్రిం కోర్టు వారంద‌రికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. వారిలో 813 మంది మాత్రమే హాజరయ్యారు కాగా.. ఫలితాల అనంతరం సదరు కేంద్రంలో వచ్చిన అత్యధిక స్కోరు 682 గా ఉండటం గమనార్హం. అది కూడా ఒక్క విద్యార్థికే వచ్చింది. మ‌రో 13 మంది విద్యార్థుల‌కేమో 600 పైగా మార్కులు వ‌చ్చాయి.

#Tags