Schools Re-Open: వ‌చ్చే వారం నుంచి పాఠ‌శాల‌ల పునఃప్రారంభం.. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న ఇందుకేనా!

పాఠ‌శాల‌లు పునఃప్రారంభం అయితే విద్యార్థుల్లో కంటే ఎక్కువ భ‌యం తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఈ రోజుల్లో పెరుగుతున్న ఖ‌ర్చులు, త‌గ్గుతున్న ఆదాయం వ‌ల‌న త‌ల్లిదండ్రులు చెందే ఆందోళ‌న అంత ఇంత కాదు. ప్ర‌స్తుతం, ఈ విష‌యంపైనే ఈ క‌థ‌నం..

కృష్ణ‌: వేసవి సెలవులు ముగిసే సమయం దగ్గరకు వచ్చింది. మరో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో ఏటా పెరుగుతున్న ఫీజులు, పుస్తకాల ధరలు చూసి మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. బ్యాగు, పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, బూట్లు వంటి ధరలు కూడా ఎప్పుటికప్పుడు పెరిగిపోతున్నాయి. జూన్‌ వచ్చిందంటేనే తల్లిదండ్రులు హడలెత్తిపోతున్నారు. పట్టణాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లోనే చదివించాలని పట్టుదలతో ఉంటున్నారు. పిల్లలకు ఐదు సంవత్సరాలు దాటగానే ఏ పాఠశాలలో వేయాలి? ఎక్కడ బాగుంటుంది? మా అబ్బాయి పదో తరగతి పాసయ్యాడు ఏ కళాశాలలో జాయిన్‌ చేయాలి? అనే అంశం గురించి చర్చించుకుంటున్నారు. అందుకు అవసరమయ్యే వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.

Inter 2nd Round Admission List: ‘బీసీ గురుకుల కాలేజీ’ల్లో రెండోవిడత ప్రవేశాల జాబితా విడుదల

జూన్‌ నెలంటే భయం..

సామాన్య, మధ్య తరగతి ప్రజలకు జూన్‌ నెల వచ్చిందంటే ఎక్కడలేని భయం. విద్యార్థులను పాఠశాలలకు పంపించడంతోపాటు, రైతులు సాగు ప్రారంభించేందుకు డబ్బులు చూసుకోవాలి. దీంతో ఈ నెలలో ఖర్చులు తడిసిమోపెడవుతుంటాయి. మార్కెట్లో విద్యార్థులకు కావలసిన బ్యాగ్‌, బూట్లు, పుస్తకాలు, ఆటో, బస్‌ చార్జీలు వంటి వాటితో చుక్కలు కనపడుతున్నాయి. ఆదాయం తక్కువగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు పెనుసవాల్‌గా మారింది. పాఠశాలలో కనీస సౌకర్యాలు ఎలా ఉన్నా ఫీజులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు టెస్టు, వర్క్‌, నోట్‌ పుస్తకాలు కనీసం సుమారు రూ.4 వేలు తక్కువ కావడం లేదు. అంతేకాకుండా యూనిఫాం కూడా ఒక్కో స్కూల్‌కు ఒక్కో రకంగా ఉంటుంది. పైగా దానిపై టీషర్టు అంటూ ఒకటి.. వారంలో ఒకరోజు వైట్‌ డ్రస్సు అంటూ మరొకటి.. ఈ ఖర్చులను చూసి సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్పో సప్పో చేసి తమ బిడ్డలను మంచి ప్రైవేటు పాఠశాలలో మాత్రమే చదివించాలనే తపనతో తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు.

UPSC Civils Prelims 2024: ఈనెల 16న యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

దుకాణాలు కిటకిట..

జూన్‌ నెలలో విద్యార్థులకు కావలసిన వస్తువులు కోసం దుకాణాలు కిటకిటలాడుతాయి. స్టేషనరీ, రెడిమేడ్‌ దుస్తులు, చెప్పుల షాపులు, హాస్టల్‌ల్లో ఉండే విద్యార్థుల కోసం వస్తువులు కొనే షాపులు, అన్నీ విద్యార్థుల తల్లిదండ్రులతో నిండుతున్నాయి. నోట్‌ పుస్తకాలు రూ. 25 నుంచి 30 వరకు ఉండగా బ్యాగులు రూ. 200 నుంచి రూ. 1000, రెండు జతల స్కూల్‌ డ్రస్సులతోపాటు వైట్‌ డ్రస్సు ఒక జత, టీషర్టు ఒకటి కలిపి తక్కువలో తక్కువగా రూ. 4 వేల వరకు ఉంటున్నాయి. ఈ ఖర్చులు తల్లిదండ్రులకు గుదిబండలా మారాయి. మొత్తం మీద చదువుకున్నట్లు లేదని, చదుకు కొన్నట్లు ఉందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు.

జూన్‌ నెల అంటేనే భయపడుతున్న సామాన్యులు ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో పెరిగిన ఫీజులు, పుస్తకాల ధరలు మరో వారంలో పాఠశాలల పునఃప్రారంభం

Shruti Ojha, IAS: గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే చేర్చాలి

#Tags