Semester Results Out: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల, రీవాల్యుయేషన్‌కు చివరి తేదీ ఇదే
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని 2016–2019 మధ్య చదివిన ఓల్డ్ రెగ్యులేషన్ డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాలను ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్‌భాస్క ర్ విడుదల చేశారు. ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.
Teacher jobs: గురుకులాల్లో అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. వీళ్లు అర్హులు
రెండో సెమిస్టర్ 1117 మంది పరీక్ష రాయగా, 545మంది ఉత్తీర్ణత సాధించారు. 48.79 శాతం ఉత్తీర్ణత నమోదైంది. నాలుగో సెమిస్టర్‌లో 1994 మంది పరీక్షకు హాజరు కాగా 923 ఉత్తీర్ణత సాధించారు. 46.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రీవాల్యుయేషన్ అవసరమైన వారు 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
#Tags