Quiz Competition for Students : విద్యార్థుల ప్రతిభకు క్విజ్ పోటీలు.. ఈ కేటగిరీల్లోనే!
సీటీఆర్‌ఐ: స్వామి వివేకానంద యువజన సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్విజ్ 2025 పోటీల్లో పాల్గొని విద్యార్థులు వారిలోని సృజనాత్మకతను ప్రదర్శించే చక్కటి అవకాశం ఉందని కలెక్టర్ మాధవీలత అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో క్విజ్ 2025 బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించాలని సూచించారు.
NEET-UG 2024: నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ వాయిదాకు సుప్రీం కోర్టు నో
క్విజ్ పోటీలలో జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్, వివేకానంద రచనలపై పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. మూడు కేటగిరీల్లో పాఠశాల స్థాయిలో పోటీలను నిర్వహించనున్నట్లు, ఆయా విభాగాల్లో గెలుపొందిన విజేతలకు 2025 జనవరి 12వ తేదీన వివేకానంద జయంతి సందర్భంగా లాప్ టాప్ తదితర బహుమతులు అందజేయనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకులు ఎస్.రాఘవేంద్రరావు వివరాలు తెలియజేస్తూ వివేకానంద క్విజ్ 2025లో జూనియర్ విభాగంలో 5, 6 తరగతుల విద్యార్థులకు, సీనియర్ విభాగంలో 7, 8 తరగతుల విద్యార్థులకు, మాస్టర్ విభాగంలో 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు విభాగాల్లో నిర్వహిస్తామన్నారు.
Anti-paper Leak Act : అమలులోకి పేపర్ లీక్ నిరోధక చట్టం.. జైలు శిక్ష, జరిమానాలు ఇలా..
నాలుగు దశల్లో స్క్రీనింగ్, ప్రాథమిక, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ విధానంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తరగతుల విద్యార్థులకు వారి తరగతి సబ్జెక్టులతో పాటుగా జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్, వివేకానంద సాహిత్యం వంటి అంశాల్లో ప్రశ్నలు ఉంటాయని తెలియజేశారు. ఇతర వివరాలకు 94417 81525 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు పాల్గొన్నారు.