Skip to main content

NEET-UG 2024: నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ వాయిదాకు సుప్రీం కోర్టు నో

Supreme Court  నీట్‌ యూజీ 2024  కౌన్సెలింగ్‌  వాయిదాకు సుప్రీం కోర్టు నో  NEET UG counseling announcement
నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ వాయిదాకు సుప్రీం కోర్టు నో

న్యూఢిల్లీ: జూలై 6 నుంచి జరగాల్సిన నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్‌ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రధాన పిటిషన్లపై విచారణను కోర్టు ఇప్పటికే జూలై 8కి వాయిదా వేయడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను కూడా ఆ తేదీ దాకా వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ శుక్రవారం అందుకు నిరాకరించింది. విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: అమలులోకి పేపర్‌ లీక్‌ నిరోధక చట్టం.. జైలు శిక్ష, జరిమానాలు ఇలా..

Published date : 22 Jun 2024 10:45AM

Photo Stories