Sankranthi Holidays 2023 : తెలంగాణ‌లో సంక్రాంతి సెల‌వులు ఇవే.. ఏపీలో మాత్రం భారీగానే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో సంక్రాంతి సెలవుల్ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు తెలంగాణ విద్యాశాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తెలంగాణ‌లోని స్కూల్స్‌కు జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 17వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెలవులను ప్రకటించారు.
Sankranthi Holidays 2023 Details

జనవరి 18వ తేదీన (బుధవారం) పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. పాఠశాలలకు 5 రోజులపాటు, కాలేజీలకు 3 రోజులపాటు సెలవులు ఉంటాయని వెల్లడించింది. జనవరి14వ తేదీన‌ భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉండగా.. జనవరి 17న కూడా సెలవురోజుగా ప్రకటించారు.

వ‌చ్చే ఏడాది 2023లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఈ సారి ఉద్యోగుల‌కు మాత్రం..

ఈ సారి కాలేజీలకు మాత్రం..
జూనియ‌ర్ కాలేజీలకు కేవలం 3 రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించారు. జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. జనవరి 16న కనుమ పండుగ ఉండగా.. అదేరోజు కాలేజీలు తెరచుకోనున్నాయి. అయితే.. ఈ సారి సంక్రాంతి పండుగ ఆదివారం రోజు, భోగి రెండో శనివారం రోజు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులంతా నిరాశలో ఉన్నారు. సంక్రాంతికి ప్రత్యేక సెలవులను కోల్పోయామనే భావన వారిలో ఉంది.

Work From Home : కరోనా ఎఫెక్ట్‌.. ఆఫీస్‌కు రావొద్దు.. వచ్చే ఏడాది మొత్తం ఇలాగే..!
 

ఏపీ సంక్రాంతి సెలవులు ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసింది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు సెలవుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న‌ట్లు పాఠశాల విద్యాశాఖ జ‌న‌వ‌రి 7వ తేదీన‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ప్రకటించిన అకడమిక్ సెల‌వుల క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవుల్ని జనవరి 11 నుంచి 16 వరకూ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ముందుగా నిర్ణయించింది. అయితే సంక్రాంతి సెలవుల్లో మార్పుకు సంబంధించి ఇటీవ‌ల ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. జ‌న‌వ‌రి 17వ తేదీ ముక్కనుమ ఉన్న నేపథ్యంలో సెలవుల్ని 12 నుంచి 18వ తేదీకి మార్పు చేశారు. 19వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.

☛ ఏపీ ప‌దోత‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి
 

ఈ సారి జ‌న‌వ‌రి నెల‌లో వ‌చ్చే సెల‌వులు ఇంతే..

➤ సాధారణ సెలవుల్లో జనవరి 1వ తేదీని ప్రభుత్వం పేర్కొంది. కాకపోతే ఈ సారి జనవరి 1న‌ ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు అదనపు సెలవును పొందే ఛాన్స్ మిస్ అయ్యింది.
➤  ఈ నెల అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులు. భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ రోజు రెండో శనివారం. దీంతో విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు.
➤  భోగి మరుసటి రోజు జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. అయితే.. సంక్రాంతి కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడం మరో నిరాశ కలిగించే అంశం. జనవరి 16న సోమవారం కనుమ పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది. 
➤ ఆదివారాలు, రెండో శనివారం కలిపితే జనవరిలో బోలెడు సెలవులు వస్తాయి. ఆయా తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి.
➤ రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీన‌ గురువారం రోజు వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది.
➤ జనవరి 8, 22, 29 తేదీల్లో ఆదివారం ఉంటుంది. దీంతో ఆయా రోజుల్లో సెలవు ఎలాగూ ఉంటుంది. ఇంకా జనవరి 28న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

నిరాశ ప‌రిచిన ఆదివారం..
ఈ కొత్త సంవత్సరంలో సాధారణంగా జనవరిలో ఎక్కువ సెలవులు ఉంటాయి. ఎందుకంటే.. కొత్త సంవత్సరం, సంక్రాంతి, రిపబ్లిక్ డే సైతం ఈ నెలలోనే ఉంటాయి. ఇక ఆదివారాలు, రెండో శనివారం కలిపితే బోలెడు సెలవులు ఉంటాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. జనవరి 1న సెలవు దినంగా ప్రభుత్వం పేర్కొంటుంది. ఈసారి జనవరి 1 ఆదివారం రోజు రావడంతో.. విద్యార్థులు, ఉద్యోగులు సెలవు తీసుకునే అవకాశం లేదు. భోగి పండుగ కూడా రెండో శనివారం రాగా.. సంక్రాంతి ఆదివారం వచ్చింది. దాంతో విద్యార్థులు, ఉద్యోగులు మూడు రోజులు సెలవులను కోల్పోయారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

#Tags