Pragathi Merit Scholarship : ప్రగతి మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు అర్హ‌త సాధించిన పాలిటెక్నిక్ విద్యార్థినులు.. స్కాల‌ర్‌షిప్ ఎంత‌?

అనంతపురం: న్యూఢిల్లీకి చెందిన ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) మంజూరు చేస్తున్న ప్రగతి మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన 9 మంది విద్యార్థినులు అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విద్యార్థులు కె.జోషిత, పి.మౌనిక, కేఎం నందిని, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో కె.నవ్యశ్రీ, జి.హర్షిణి, వి.మహాలక్ష్మి, బి.శ్రేయ, సివిల్‌ బ్రాంచ్‌లో నందిని, ఎస్‌.మీనాక్షి ఉన్నారు.

NAAC at Degree College : ప్ర‌భుత్వ మ‌హిళ డిగ్రీ క‌ళాశాల‌లో న్యాక్ బృందం.. వ‌స‌తులు, విద్యాభివృద్దిపై ప‌రిశీల‌న‌!

వీరిలో ఒక్కొక్కరికి ఏడాదికి రూ.50 వేలు చొప్పున మూడేళ్ల కోర్సు పూర్తి అయ్యే వరకూ స్కాలర్‌షిప్‌ను ఏఐసీటీఈ అందజేయనుంది. ప్రతిభ చాటిన విద్యార్థినులను ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సి.జయచంద్రారెడ్డి, ఆటోమొబైల్‌ విభాగాధిపతి ఎన్‌.శ్రీనివాసరావు, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్‌ ఎం.రామకృష్ణారెడ్డి అభినందించారు.

Scouts and Guides : ప్ర‌తీ పాఠ‌శాల‌ల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు!

#Tags