Palamuru University: పాలమూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి మరో నాలుగు పీజీ సీట్లు

పాలమూరు: పాలమూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు కొత్తగా పిడియాట్రిక్‌ విభాగంలో నాలుగు పీజీ సీట్లు మంజూరు చేస్తూ జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) శుక్రవారం మెయిల్‌ ద్వారా కళాశాల అధికారులకు తెలిపింది. కొత్తగా వచ్చిన నాలుగు పిడియాట్రిక్‌ పీజీ సీట్లు 2024– 25 నుంచే అమల్లోకి రానున్నాయి.

దీంతోపాటు ఈ ఏడాది అప్తామాలజీ, అనస్తీషియా విభాగాలకు సైతం పీజీ సీట్ల కోసం కళాశాల అధికారులు దరఖాస్తు చేయగా ఆ యా విభాగాల్లో ప్రొఫెసర్లు లేరంటూ కారణం చూ పుతూ ఎన్‌ఎంసీ తిరస్కరించింది. అయితే పాల మూరు మెడికల్‌ కళాశాలలోని అనస్తీషియాలో వి భాగంలో ఆరేళ్లుగా, అప్తామాలజీ విభాగంలో నాలుగు ఏళ్లుగా ప్రొఫెసర్లు పనిచేస్తున్నట్లు కళాశాల డైరెక్టర్‌ రమేష్‌ వెల్లడించారు.

Free Training news: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

వీటిపై మరోసారి పూర్తిస్థాయిలో నివేదిక జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌కు అప్పీల్‌ చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. మె డికల్‌ కళాశాలలో ఇప్పటి వరకు 9 విభాగాల్లో 26 పీజీ సీట్లు ఉండగా కొత్తగా పీడియాట్రిక్‌ విభాగంలో వచ్చిన నాలుగు సీట్లతో 30కి చేరాయి. కళాశాలలో పీజీ సీట్లు పెరగడంతో వైద్య సేవలు మెరుగుపడనున్నాయి. సీట్లు రావడానికి కృషి చేసిన బోధ నాచార్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

#Tags