Open Exams: వచ్చే నెల టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు.. తేదీలు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం నుంచి టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. పూర్తి వివరాలు..

సాక్షి ఎడ్యుకేషన్‌: వచ్చే నెల 18 నుంచి ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం నుంచి షెడ్యూల్‌ విడుదల అయిందని ఎల్లవరం ఎ–1 సెంటర్‌ కోఆర్డినేటర్‌ సీహెచ్‌.చిన్నిబాబుదొర తెలిపారు. టెన్త్‌కు సంబంధించి మార్చి18న తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం, ఇంటర్‌కు సంబంధించి హిందీ, తెలుగు,ఉర్దూ సబ్జెక్టులక పరీక్షలు నిర్వహిస్తారన్నారు. రెండవ రోజు, 19న టెన్త్‌ విద్యార్ధులకు హిందీ, ఇంటర్‌ విద్యార్థులకు జీవ శాస్త్రం, వాణిజ్య శాస్త్రం, వ్యాపార శాస్త్రం, గృహ విజ్ఞాన శాస్త్రం, 20న టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులకు ఇంగ్లీషు పరీక్ష ఉంటుందన్నారు. 22న టెన్త్‌ గణితం,భారతీయ సంస్కృతి వారసత్వం, ఇంటర్‌కు సంబంధించి గణితం, చరిత్ర, వ్యాపార గణాంక శాస్త్రం పరీక్షలు ఉంటాయన్నారు.

Digital Classes: విద్యార్థులకు డిజిటల్‌ బోధన..

23న టెన్త్‌ విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం,గృహ విజ్ఞాన శాస్త్రం, ఇంటర్‌ విద్యార్థులకు భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, పౌర శాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం జరుగుతుందన్నారు. 26న టెన్త్‌కు సాంఘిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, ఇంటర్‌కు రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం,27 న టెన్త్‌ విద్యార్థులకు బిజినెస్‌ స్టడీస్‌, మనో విజ్ఞాన శాస్త్రం సబ్జెక్ట్‌లకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు.ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకూ జరుగుతాయన్నారు.ప్రతి రోజు పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఉంటాయన్నారు. పరీక్షల తేదీకి 10 రోజులముందు హాల్‌ టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.

#Tags