Online Evaluation: ఈసారి ప‌రీక్ష‌ల‌ మూల్యాంక‌నం ఆన్‌లైన్ విధానంలో..

స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల మూల్యాంక‌నం స‌మ‌యంలో ఉపాధ్యాయుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఇలా చ‌ర్య‌లు చేప‌ట్టారు అధికారులు..

అనంతపురం: ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టడానికి ఇంటర్‌ బోర్డు శ్రీకారం చుట్టనుంది. ఈనెల 24 నుంచి జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాలను ఆన్‌లైన్‌లోనే దిద్దనున్నారు. ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ప్రతి జిల్లాలోనూ మూల్యాంకనం కేంద్రం ఏర్పాటు చేసేవారు. వార్షిక పరీక్షలకైతే 20 రోజులు, సప్లిమెటరీ పరీక్షలకైతే 12 రోజుల పాటు మూల్యాంకనం జరిగేది.

Exams Day: నేడు జిల్లావ్యాప్తంగా మూడు ప‌రీక్ష‌ల‌ నిర్వ‌హ‌ణ‌..

సప్లిమెంటరీ పరీక్షల తర్వాత చేపట్టే మూల్యాంకనం సరిగ్గా జూన్‌ 1 నుంచి మొదలవుతుంది. అప్పడప్పుడే కళాశాలలు పున:ప్రారంభం అవుతాయి. ఈ సమయంలోనే విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతుంటాయి. అయితే అధ్యాపకులందరూ ‘స్పాట్‌’ కేంద్రంలో ఉండాల్సి రావడంతో ఓవైపు తరగతుల నిర్వహణకు ఆటంకంతో పాటు మరోవైపు అడ్మిషన్లకు ఇబ్బందిగా మారుతోంది. అదే ప్రైవేట్‌ కళాశాలల్లో అడ్మిషన్లు బాగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఈ సమస్యను అధిగమించి అధ్యాపకులందరూ కళాశాలల్లో అందుబాటులో ఉండేందుకే ఈ ఆన్‌లైన్‌ విధానం తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు ఎలాంటి పొరబాట్లకు తావు ఉండదని చెబుతున్నారు.

Gurukulam Counseling: గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌..

మ్యానువల్‌గా మూల్యాంకనం చేసే సమయంలో మార్కుల టోటలింగ్‌లో పొరబాట్లు, కొన్ని ప్రశ్నలకు మార్కులు మరిచిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఒక విద్యార్థికి 70 మార్కులు వస్తే టోటల్‌ మార్కులు వేసే సమయంలో పొరబాటున సున్నా ఎగిరిపోయి 7 మార్కులు మాత్రమే వేశారు. తర్వాత రీ వెరిఫికేషన్‌లో అసలు విషయం బయటపడింది. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండదు.

ఒక ప్రశ్న పరిశీలించిన తర్వాతనే రెండో ప్రశ్న డిస్‌ప్లే

ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసేటప్పుడు మొదటి ప్రశ్న డిస్‌ప్లే వచ్చిన తర్వాత ఎగ్జామినర్‌ పరిశీలించిన తర్వాతనే రెండో ప్రశ్న వస్తుంది. ఇలా ప్రతిప్రశ్న తప్పనిసరిగా పరిశీలించిన తర్వాతనే ఫైనల్‌ సబ్‌మిట్‌ చూపిస్తుంది. విద్యార్థి జవాబు రాసినా, రాయకపోయినా అన్ని ప్రశ్నలూ పరిశీలించాల్సి ఉంటుంది. దీనిద్వారా ఏ ఒక్క ప్రశ్న మరిచిపోయే అవకాశం ఉండదు. మార్కుల విషయంలో ఒక ప్రశ్నకు మ్యాగ్జిమం వేయాల్సిన మార్కులంటే ఎక్కువ వేసినా తీసుకోదు.

Polycet Counselling: సోమ‌వారం పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి కౌన్సెలింగ్‌..

తరగతులకు ఆటంకం కలగకూడదు

ఆన్‌లైన్‌లో పేపర్లు దిద్దే ఎగ్జామినర్లు ఎట్టి పరిస్థితుల్లో కళాశాలల్లో విద్యార్థుల తరగతలకు ఆటంకం కలిగించకూడదు. ఉదయం 8 గంటలలోపు, తర్వాత కళాశాల నుంచి వచ్చిన తర్వాత మూల్యాంకనం చేసుకోవచ్చు. కళాశాలలో పిరియడ్లు లేని సమయంలోనూ చేసుకోవచ్చు. ప్రతి ఎగ్జామినరూ ‘టీక్యూఐడీ’ ద్వారా లాగిన్‌ అయి వెంటనే పాస్‌వర్డ్‌ మార్చుకోవాలి. తర్వాత వెబ్‌కెమెరా ముందు తన ఫొటో క్యాప్చర్‌ చేసి లాగిన్‌ అవుతారు. ముందుగా ఐదు ప్రాక్టీస్‌ పేపర్లు మూల్యాంకనం చేసిన తర్వాత రెగ్యులర్‌ పేపర్లు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో ఎగ్జామినగర్‌కు రోజుకు గరిష్టంగా 50 జవాబుపత్రాలు అందుబాటులో ఉంటాయి.

Quiz of The Day (May 24, 2024): సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది?

డీఆర్డీసీ స్థానాల్లో ఆర్‌ఆర్‌ఎస్‌సీలు

మ్యూనువల్‌ మూల్యాంకనం సమయంలో ప్రతి జిల్లాలోనూ డీఆర్డీసీ జిల్లా రీకలెక్షన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ఉండేది. దీనిద్వారా జిల్లాలోని అన్ని జవాబుపత్రాలను కలెక్షన్‌ చేసి ఎంపిక చేసిన జిల్లాలకు పంపేవారు. ఇప్పుడు రీజనల్‌ రెసిప్షన్‌ స్కానింగ్‌ సెంటర్‌ (ఆర్‌ఆర్‌ఎస్సీ)లు అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఎంపిక చేసిన ఆర్‌ఆర్‌ఎస్‌సీలకు జవాబుపత్రాలు పోతాయి. అక్కడ ఆన్‌లైన్‌లో నమోదు చేసి మూల్యాంకనానికి చర్యలు తీసుకుంటారు.

June Month Holidays 2024 List : జూన్ నెలలో 10 రోజులు సెలవులు.. ఎందుకంటే..?

సప్లిమెంటరీ నుంచి ఆన్‌లైన్‌లోనే ‘స్పాట్‌’

సప్లిమెంటరీ జవాబుపత్రాలను ఆన్‌లైన్‌ ద్వారానే మూల్యాంకనం చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు అందాయి. ఈ ఆన్‌లైన్‌ విధానంపై అవవగాహన కల్పించేందుకు నేడు (బుధవారం) ఉదయం 11.30 గంటలకు అనంతపురం కొత్తూరు ప్రభుత్వ ఒకేషనల్‌ కళాశాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. అన్ని యాజమాన్యాల కళాశాలల నుంచి ఒక్కో అధ్యాపకుడు ఖచ్చితంగా హాజరుకావాలి. వర్చువల్‌ విధానంలో బోర్డు అధికారులు అవగాహన కల్పిస్తారు.

– ఎం. వెంకటరమణనాయక్‌, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఇంటర్‌ బోర్డు

Inter First Year Admissions: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మీషన్స్‌ షురూ..చివరి తేదీ ఎప్పుడంటే..

#Tags