Skip to main content

Exams Day: నేడు జిల్లావ్యాప్తంగా మూడు ప‌రీక్ష‌ల‌ నిర్వ‌హ‌ణ‌..

ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌కు సంబంధించి స‌ప్లిమెంట‌రీ పరీక్ష‌లతోపాటు డీఈఈ-సెట్ ప‌రీక్ష‌ను కూడా నేడే నిర్వ‌హిస్తున్నారు..
Tenth, Inter supplementary and DEECET 2024 examination   Education officials coordinating exam arrangements

అనంతపురం: జిల్లావ్యాప్తంగా నేడు మూడు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి సప్లిమెంటరీ, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానుండగా, డీఈఈ సెట్‌ కూడా జరగనుంది. ఇందుకోసం విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పదో తరగతి పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 13,332 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. జూన్‌ 3 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

Gurukulam Counseling: గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌..

● ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 30తో ప్రధాన పరీక్షలు ముగుస్తాయి. 31, జూన్‌ 1 మైనర్‌ సబ్జెక్టుల పరీక్షలుంటాయి. జిల్లాలో 22,510 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలుంటాయి. పరీక్షల సమయంలో నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లో అనుమతి ఉండదు.

School Text Books: నూత‌న విద్యా సంవత్స‌రానికి పాఠ్య‌పుస్త‌కాలు సిద్ధం..

● డీఈఈసెట్‌–2024 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉంటుంది. మొత్తం 344 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అనంతపురం నగర శివారులోని చిన్మయానగర్‌ ఎల్‌ఆర్‌జీ స్కూల్‌ పక్కన నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ చర్చ్‌ సోషియల్‌ యాక్షన్‌ ఇండియా (ఎన్‌సీపీఎస్‌ఏఐ)ను పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు డీఈఓ వరలక్ష్మీ తెలిపారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు.

Inter First Year Admissions: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మీషన్స్‌ షురూ..చివరి తేదీ ఎప్పుడంటే..

Published date : 24 May 2024 03:36PM

Photo Stories