June Month Holidays 2024 List : జూన్ నెలలో 10 రోజులు సెలవులు.. ఎందుకంటే..?
జూన్ నెలలో బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. జూన్ నెలలో బ్యాంకు పనులుంటే ఈ సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోవడం మంచిది. జూన్ నెలలో ఏయే ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు బ్యాంకు సెలవులున్నాయో తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది.
పబ్లిక్ హాలిడేస్ కాకుండా ప్రాంతీయ సెలవులుంటాయి. ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. అందుకే బ్యాంకు పనులుంటే ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో చెక్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. జూన్ నెలలో బ్యాంకులకు 10 రోజుల వరకూ సెలవులున్నాయి మరి. ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు ఎంతగా పెరుగుతున్నా ఏదో పని నిమిత్తం బ్యాంకులు వెళ్లాల్సిన అవసరం వస్తోంది.
☛ May 27th Holiday : మే 27వ తేదీన సెలవు.. ఎందుకంటే..?
ఈసారి జూన్‌లో 10 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఇందులో రెండవ, నాలుగవ శనివారాలు, నాలుగు ఆదివారాల రూపంలో ఆరు రోజులు మినహాయిస్తే మరో నాలుగు రోజులు సెలవులున్నాయి. రాజా సంక్రాంతి, బక్రీద్ వంటి పండుగలు జూన్ నెలలోనే ఉన్నాయి. జూన్‌లో బ్యాంకులకు 10 రోజులు సెలవులు ఉన్నా ఏటీఎంలు పనిచేస్తాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ సేవలకు ఇబ్బంది ఉండదు.
జూన్ 2024 బ్యాంకు సెలవుల వివరాలు ఇవే..
☛ జూన్ 2 ఆదివారం బ్యాంకులకు సెలవు
☛ జూన్ 8 రెండవ శనివారం సెలవు
☛ జూన్ 9 ఆదివారం సెలవు
☛ జూన్ 15 రాజా సంక్రాంతి సందర్భంగా మిజోరాం, ఒడిశాలో సెలవు
☛ జూన్ 16 ఆదివారం సెలవు
☛ జూన్ 17 ఈద్ ఉల్ అజ్హా లేదా బక్రీద్ సెలవు
☛ జూన్ 18 జమ్ము కశ్మీర్‌లో బక్రీద్ సెలవు
☛ జూన్ 22 నాలుగవ శనివారం సెలవు
☛ జూన్ 23 ఆదివారం సెలవు
☛ జూన్ 30 ఆదివారం సెలవు
Tags
- June Month Holidays 2024
- June Month Holidays 2024 News in Telugu
- June Month Bank Holidays 2024
- June Month Bank Holidays 2024 News in Telugu
- june month government holidays 2024
- june month government holidays 2024 news telugu
- june month private holidays 2024
- june month private holidays 2024 news telugu
- june month festival 2024
- june month festival 2024 news telugu