Indian Students : అమెరికాలో భారీగా తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య.. తొలిసారిగా.. కారణం ఇదే..?
సాక్షి ఎడ్యుకేషన్: ఎంతోమంది విద్యార్థులు పై చదువులకోసం, ఉన్నత విద్య పొందేందుకు ఎక్కువ శాతం ఇష్టపడేడి అమెరికా దేశాన్నే.. ఈ దేశంలో ఉన్నత విద్య పొందితే ఉత్తమ ఉద్యోగాలు లభిస్తాయి. ఉన్నతంగా స్థిరపడొచ్చు అని ఎక్కవ శాతం విద్యార్థులు ఆశిస్తారు.
Big Breaking Tomorrow Holiday : రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కారణం ఇదే..!
కేవలం, భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. కాని, గతకొంత కాలంగా, అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. అక్కడ జారీ చేసే ఎఫ్-1 వీసాల సంఖ్య భారీగా పడిపోయింది..
Mother and Daughters : స్టేజీపై స్టెప్పులతో అదరగొట్టిన తల్లీ కూతుర్లు..
ఎఫ్-1 వీసా అప్పుడు-ఇప్పుడు
ఈ ఏడాది తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు జారీ చేసే ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు 38శాతం తగ్గిందని అమెరికా విదేశాంగ శాఖ గణాంకాలు ఈ వివరాలను వెల్లడించారు. అయితే, బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
గతేడాది సంవత్సరంలోని తొలి 9 నెలల్లో ఎప్ 1 వీసాల సంఖ్య 1,03,495గా ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మధ్య 64,008 మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలను జారీ చేసింది ప్రభుత్వం. కోవిడ్ తరువాత ఇంత స్థాయిలో అమెరికా వీసాల సంఖ్య తగ్గడం ఇదే తొలిసారి.
అసలు ఎఫ్-1 వీసా అంటే..!
ఎఫ్-1 వీసా అనేది నాన్-ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైమ్ విద్యను పొందేందుకు ఈ వీసాను అనుమతినిస్తుంది అక్కడి ప్రభుత్వం. అగ్రరాజ్యంలోని విద్యాసంస్థలు ఏటా రెండుసార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు- డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు.
Job Mela: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చైనాలో కూడా..
2021 తొలి తొమ్మిది నెలల్లో 65,235 మందికి ఎఫ్-1 విద్యార్థి వీసాలు ఇవ్వగా.. 2022 జనవరి-సెప్టెంబరు మధ్య 93,181 మంది భారతీ విద్యార్థులకు వీసాలు దక్కాయి. అయితే, ఈసారి భారతీయులకు మాత్రమే కాదు.. చైనా విద్యార్థులకు జారీ చేసిన వీసాల్లోనూ 8శాతం తగ్గుదల కన్పించింది. అయితే, గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 73,781 మంది చైనీస్ విద్యార్థులకు వీసాలు అందాయి. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 80,603గా ఉంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
భారత్ తొలిస్థానంలో..
అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల్లో తొలిసారిగా భారత్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఎన్నోఏళ్లుగా ప్రథమస్థానంలో ఉన్న చైనాను ఈసారి మన దేశం వెనక్కి నెట్టింది. గత విద్యా సంవత్సరం(2023-24) నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్ తొలిస్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398 మాత్రమే. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు 11.26 లక్షల మంది ఉండగా.. వారిలో 29 శాతం మంది భారతీయులే..!