Awareness Conference: ఆశ్రమ విద్యార్థులకు న్యాయ చైతన్య సదస్సు

జిల్లా కేంద్రంలోని అనాథ ఆశ్రమంలో న్యాయ చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులు మాట్లాడారు..

 

మహబూబాబాద్‌ రూరల్‌: పిల్లలందరూ బాగా చదువుకోవాలని, చదువుతోనే ఉజ్వల భవిష్యత్‌ సాధ్యమని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మౌనిక అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని దైవ కృప అనాథ ఆశ్రమం, ఆశాభవన్‌లో న్యాయ చైతన్య సదస్సును నిర్వహించారు.

Gurukul School Students Record: ఈ రికార్డుల్లో స్థానం దక్కించుకున్న గురుకుల విద్యార్థులు

ఈ సందర్భంగా జడ్జి మౌనిక మాట్లాడుతూ.. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పిల్లలు పనిలో కాకుండా పాఠశాలలో ఉండాలని అప్పుడే అంబేడ్కర్‌ కలలు కన్న భారతదేశం సాక్షాత్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్సై అరుణ, సంపత్‌రెడ్డి, రాంబాబు, విజయ్‌, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Dr Jayaraj: చదువుకు పేదరికం అడ్డుకాదు.. వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థినులు..

#Tags