Lack of Hostel Facilities : హాస్ట‌ల్ భోజ‌నంపై విద్యార్థినుల ఆగ్ర‌హం.. అధికారుల‌కు ప్ర‌శ్న‌ల వ‌ర్షం!

హాస్టల్‌లో స‌రైన వ‌స‌తులు లేక ఇబ్బందులు ఎదురుకుంటున్న విద్యార్థినుల‌కు మ‌రో స‌మ‌స్య భోజ‌నం.. చివ‌రికి వాస‌న వ‌స్తున్న భోజ‌నం ఒడ్డిస్తే ఎలా తింటారు అని అధికారుల‌పై ఇలా ప్రశ్న‌ల వ‌ర్షం కుర్పించారు..

తిరుపతి సిటీ: ఎస్వీ యూనివర్సిటీ ఉమెన్స్‌ హాస్టళ్లలో వాసన వస్తున్న ఆహారాన్ని తమకు పెడుతున్నారని పీజీ హాస్టల్‌ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వర్సిటీ ఏడీ బిల్డింగ్‌ ఎదుట పెద్దఎత్తున ర్యాలీ అనంత‌రం విద్యార్థినులు తమ సమస్యలపై అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్సిటీలోని లేడీస్‌ హాస్టళ్లలో బుధవారం రాత్రి వాసన వెదజల్లుతున్న చికెన్‌ను వడ్డించారని, ఏంటి ఇదని హాస్టల్‌ వార్డెన్‌ను నిలదీస్తే స్పందించలేదని వాపోయారు. మీ ఇళ్లలో పిల్లలకు ఇలాంటి ఆహారం పెడతారా అని అధికారులను నిలదీశారు. తాము నెలకు సుమారు రూ.3 వేలకు పైగా మెస్‌ బిల్లు చెల్లిస్తున్నా, నిత్యం నాసిరకమైన వంటకాలనే పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Assistant Professor Jobs: ఎంఎన్‌జే ఆస్పత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీ

కనీసం పండుగలు వచ్చినా నాసిరకం వడ, పాయసం తప్ప ఇంకేమీ పెట్టరని, ప్రతి రోజూ నీళ్ల పప్పు తప్ప ప్రత్యేకించి కర్రీలు అనే మాట ఉండదన్నారు. కనీసం ఆడపిల్లలు అనే మానవత్వం లేకుండా వర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉమెన్స్‌ హాస్టళ్లలో వాష్‌రూమ్‌లు, వాటర్‌ సప్‌లై, తాగునీరు వంటి సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఔటింగ్‌ పాస్‌లు ఇవ్వడంలో వివక్ష పాటిస్తున్నారని, ప్రధానంగా హాస్టళ్లలో ఉన్న వాచ్‌మెన్‌ల తీరు మరీ దారుణంగా ఉందన్నారు. మహిళలు అని చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారిని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Degree Admissions : డిగ్రీ మొద‌టి సంవ‌త్స‌రంలో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

సమస్యలు పరిష్కరిస్తాం..

హాస్టళ్లలో సమస్యలను విద్యార్థినులు మా దృష్టికి తీసుకువచ్చారు. అధికారులతో సంప్రదించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా. వర్సిటీలో వీసీ, పూర్తిస్థాయి రిజిస్ట్రార్లను త్వరలో నియమిస్తారు. సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తాను. ఇప్పటికే నాసిరకం భోజనాలపై వచ్చిన ఫిర్యాదులను వార్డెన్‌లు, సిబ్బందితో చర్చిస్తున్నాం. విద్యార్థినులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.

– చంద్రయ్య, ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌, ఎస్వీయూ

Heat Wave: రికార్డు స్థాయిలో ఉన్న ఎండల తీవ్రత, వరదల బీభత్సం.. ఎక్క‌డంటే..

#Tags