Employment Opportunities: నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు

పాడేరు : జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగ గిరిజన యువతులకు ఉద్యోగాల కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పోలీస్‌ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు.

గురువారం స్థానిక ఆర్‌ఆర్‌ కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేరణ కార్యక్రమానికి పాడేరు ఐటీడీఏ పరిధిలోని పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకువేలి, అనంతగిరి మండలాల నుంచి 320 మంది యువతులు హాజరు కాగా వీరిలో 250 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్ణయించామన్నారు. టాటా కంపెనీ, ప్రశాంతి ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎంపిక ప్రక్రియను నిరుద్యోగ గిరిజన యువతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎంపికై న వారికి తమిళనాడు హోసూర్‌లో 11 నెలల పాటు ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణ ఇస్తారని చెప్పారు. శిక్షణ కాలంలో నెలకు రూ.18వేల వేతనంతో పాటు రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగానే పీఎఫ్‌, మెడికల్‌ సౌకర్యం, ఇతర అలవెన్సులు ఇస్తారని తెలిపారు. ఈనెల 6న చింతపల్లిలో నిర్వహించిన ప్రేరణ కార్యక్రమంలో 330 మంది ఎంపికయ్యారన్నారు. ఈనెల 10న రంపచోడవరం, 12 ఎటపాక మండలాల్లో ప్రేరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. పాడేరు ఏఎస్పీ ధీరజ్‌, జి.మాడుగుల సీఐ రమేష్‌, ఎస్‌ఐలు రంజిత్‌, లక్ష్మణరావు, మనోజ్‌ పాల్గొన్నారు.

చదవండి: Job Mela: 15న రీజినల్‌ జాబ్‌మేళా

#Tags