Artificial Intelligence: ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌పై పట్టు సాధించాలి

బాలాజీచెరువు: ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌పై పట్టు సాధించి, సరికొత్త ఆవిష్కరణలు చేయాలని జేఎన్‌టీయూకే వీసీ డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు అన్నారు.
ఇన్నోవేషన్‌ ఫెయిర్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న వీసీ ప్రసాదరాజు

యూనివర్సిటీలో రెండు రోజుల పాటు డిజైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఇన్నోవేషన్‌ ఫెయిర్‌ను ఆయన మార్చి 26వ తేదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజానికి, రైతులకు, ఇతర రంగాలకు ఉపయోగపడేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాజెక్టులు రూపొందించడం సంతోషకరమన్నారు. నన్నయ్య వర్సిటీ వీసీ డాక్టర్‌ కొప్పిరెడ్డి పద్మరాజు మాట్లాడుతూ ఇటువంటి సదస్సులో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ ఆలోచనలను పంచుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. 
పరిశోధన, కొత్త ఆవిష్కరణలకు వేదికగా జేఎన్‌టీయూ డిజైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ నిలిచిందన్నారు. గిరిజనులకు బైక్‌ అంబులెన్స్‌, తేమ నుంచి నీటి ఉత్పత్తి వంటి పలు ప్రతిష్టాతక్మమైన ప్రాజెక్టులను జేఎన్‌టీయూకే డైరెక్టర్‌ గోపాలకృష్ణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు పొందారన్నారు. అనంతరం డైరెక్టర్‌ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వీసీలు ప్రసాదరాజు, పద్మరాజులను సత్కరించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ కోటేశ్వరరావు, రిజిస్ట్రార్‌ సుమలత, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

VC Acharya K.Padmaraju: అధ్యాపకులూ.. నిత్య విద్యార్థులే..

#Tags