Free Textile Diploma Course: హ్యాండ్లూమ్స్ టెక్స్ టైల్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు స్టైఫండ్ ఇంత‌!

చిలకలపూడి(మచిలీపట్నం): డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్స్, టెక్స్ టెక్నాలజీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ జిల్లా అధికారి కె. అప్పారావు మే 16న‌ ఓ ప్రకటనలో కోరారు.

తిరుపతి జిల్లా వెంకటగి రిలోని ప్రగడ కోటయ్య మెమోరి యల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో 15 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులు ప్రవేశ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పదో తరగతి, తత్సమానమైన పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులై ఉండాల న్నారు.

చదవండి: Fine Arts Career After Inter: ఫైన్‌ ఆర్ట్స్‌తో కలర్‌ఫుల్‌ కెరీర్‌

ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్ లో పాసైన విద్యార్థులకు, పదో తరగతితో పాటు ఐటీఐ రెండు సంవత్సరాలు పాసైన వారికి సెకండ్ ఇయర్ డిప్లొమా కోర్సునకు ప్రవేశం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలని, కోర్సు మొదటి సంవ త్సరంలో నెలకు రూ. 1000, సెకండ్ ఇయర్‌ లో నెలకు రూ. 1100, మూడో సంవత్సరంలో రూ.1200 స్టైఫండ్ ఇస్తారన్నారు.

చదవండి: NIFT Entrance Exam 2024: ఫ్యాషన్, డిజైన్‌లో ఈ కోర్సులు పూర్తి చేస్తే ఉజ్వల కెరీర్స్‌ !

వెంకటగిరిలోని కళాశాలలో 53 సీట్లు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9399936872, 9866169908లో సంప్రదించా లన్నారు. దరఖాస్తులు జూన్ 1వ తేదీలోగా ఆన్‌లైన్ లో చేయాలని ఈ అవకాశాన్ని సంబంధిత విద్యా ర్థులు సద్వినియోగం చేసుకో వాలని ఆయన కోరారు.

#Tags