Intermediate practical exams Important Dates And Tips- రేపే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. రెండు సెషన్స్‌లో పరీక్షలు, ఈ టిప్స్‌ ఫాలో అయితే..

తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి నెలలో వార్షిక పరీక్షలు ఉండగా, ఫిబ్రవరి 1 నుంచి 16వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ప్రా​క్టికల్స్‌ను రెండు సెషన్స్‌లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు (మార్నింగ్ సెషన్), మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు (మధ్యాహ్న సెషన్)లో పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది.ఈ ఏడాది తొలిసారిగా ఫస్టియర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు.ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ను ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. 


ప్రాక్టికల్స్‌కు మొత్తం సెంటర్ల సంఖ్య:  2032
ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే మొత్తం విద్యార్థులు: 3,21,803 (వీరిలో ఎంపీసీ విద్యార్థులు-2,17,714 కాగా, బైపీసీ విద్యార్థులు 1,04,089 మంది)
ఒకేషనల్ కోర్సుల్లో హాజరయ్యే విద్యార్థులు: 94,819
ఒకేషనల్ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 48,277 మంది, రెండో సంవత్సరంలో 46,542 విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు.

ఇంటర్ వార్షిక పరీక్షల తేదీలు: ఫిబ్రవరి 28-మార్చి 19 వరకు
ఎథిక్స్‌ & హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష- ఫిబ్రవరి 17(ఇంతకుముందే అడ్మిషన్ పొందిన బ్యాక్‌లాగ్స్‌ ఉన్న విద్యార్థులకు)
ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష- ఫిబ్రవరి 19న నిర్వహించనున్నారు. 
(ఈ రెండు పరీక్షలకు ఎగ్జామ్స్‌ తేదీలు: ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు)


ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం టిప్స్‌

  • ప్రాక్టికల్స్‌కు సంబంధించిన సిలబస్‌ను ముందుగానే అధ్యయనం చేయండి. 
  • ప్రయోగం వెనకున్న థియరీని అర్థం చేసుకోండి. పరీక్షలకు ముందు బుక్స్‌, మీరు సొంతంగా ప్రిపేర్‌ చేసుకున్న నోట్స్‌ని చదవండి. 
  • మీరు ప్రాక్టికల్స్‌ని ఎంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేస్తే అంత మంచిది. వీలైతే ఇంట్లోనే ప్రాక్టికల్స్‌ సెటప్‌ చేసేందుకు ప్రయత్నించండి. 
  • ప్రాక్టీకల్స్‌ రోజు ఎక్స్‌పరిమెంట్‌ ఎలా చేస్తారో ఇంట్లో కూడా అదే విధంగా సెటప్‌ చేసుకొని ప్రయత్నిస్తే మంచిది. ల్యాబ్‌ కోటు, గాగుల్స్‌, కాలిక్యులేటర్‌ వంటివి ముందుగానే సిద్ధం చేసుకోండి. 
  • ప్రాక్టికల్స్‌లో సమయపాలన చాలా ముఖ్యం. ప్రతి ప్రయోగానికి మీకు ఎంత సమయం ఉందో తెలుసుకొని దానికి తగ్గట్లు ప్లాన్‌ రూపొందించుకోండి. 
  • ఏ పరీక్షల్లో అయినా స్ట్రెస్‌ లేకుండా ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. అందుకే డీప్‌ బ్రీత్‌ తీసుకొని కూల్‌గా ప్రారంభించండి. 

#Tags